STOCKS

News


కార్పొరేషన్‌ బ్యాంకు భారీ నష్టాలు

Saturday 18th May 2019
news_main1558152669.png-25811

ముంబై: ప్రభుత్వ రంగంలోని కార్పొరేషన్‌ బ్యాంకు మార్చి త్రైమాసికం ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. మొండి బకాయిలకు పెద్ద మొత్తంలో చేసిన కేటాయింపులతో నష్టాలు భారీగా రూ.6,581 కోట్లకు పెరిగిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.1,838 కోట్ల నష్టాలతో  పోలిస్తే మూడున్నర రెట్లు పెరిగాయి. ఆదాయం సైతం ముందటేడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.4,642 కోట్ల నుంచి రూ.4,187 కోట్లకు తగ్గిపోయింది. స్థూల ఎన్‌పీఏలు మాత్రం 17.35 శాతం నుంచి 15.35 శాతానికి తగ్గాయి. ఎన్‌పీఏలకు మార్చి త్రైమాసికంలో బ్యాంకు రూ.8,505 కోట్లను కేటాయించింది. ఇక 2018-19 ఆర్థిక సంవత్సరానికి కార్పొరేషన్‌ బ్యాంకు రూ.6,325 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.4,049 కోట్ల నష్టంతో పోలిస్తే పెరిగింది. 



You may be interested

స్కూలు సేవలన్నిటికీ ‘క్రెడో’

Saturday 18th May 2019

అటెండెన్స్, ఫీజులు, అన్నీ యాప్‌ ద్వారానే  ప్రస్తుతం 60 స్కూళ్లు, కాలేజీలకు సేవలు  త్వరలో రూ.10 కోట్ల సమీకరణ  ‘స్టార్టప్‌ డైరీ’తో కె.శేషానంద రెడ్డి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విద్యారంగంలో టెక్నాలజీ బాగానే చొచ్చుకొచ్చేసింది. కాకపోతే అటెండెన్స్‌ వంటి విషయాల్లో ఇప్పటికీ సంప్రదాయ పద్ధతులే కొనసాగుతున్నాయి. అడ్మిషన్లు, స్టాఫ్‌ నిర్వహణ, స్టూడెంట్స్‌ అటెండెన్స్, ప్రోగ్రెస్‌ రిపోర్టులు, ఫీజులు.. ఇలా చాలా అంశాలను ఆన్‌లైన్‌లోకి తేవడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ సేవలందిస్తోంది

డాక్టర్‌ రెడ్డీస్ లాభం 44 శాతం అప్‌

Saturday 18th May 2019

క్యూ4లో రూ.434 కోట్లు ఆదాయం 14 శాతం వృద్ధి రూ. 4,017 కోట్లు రూ.20 తుది డివిడెండు హైదరాబాద్‌, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్‌ఎల్‌) నికర లాభం 44 శాతం ఎగిసింది. రూ. 434.4 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ. 302.2 కోట్లు. మరోవైపు, తాజాగా నాలుగో త్రైమాసికంలో ఆదాయం 14 శాతం వృద్ధి

Most from this category