STOCKS

News


టీవీలు, ఏసీలు ఆన్‌లైన్లోనే చూసి కొంటున్నారు..

Wednesday 10th July 2019
Markets_main1562740894.png-26944

  • వచ్చే నాలుగేళ్లలో డిజిటల్‌ ప్రభావం 23 బిలియన్ డాలర్ల స్థాయికి
  • బీసీజీ, గూగుల్ ఇండియా నివేదిక

న్యూఢిల్లీ: టీవీలు, ఏసీలు వంటి వినియోగ ఉత్పత్తుల గురించి ఆన్‌లైన్‌లో అధ్యయనం చేసి, వీడియోలు చూసిన తర్వాతే కొనుక్కునే ధోరణి పెరుగుతోంది. ఇలా డిజిటల్‌ మాధ్యమం ప్రభావంతో జరిగే కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మకాల పరిమాణం 2023 నాటికి 23 బిలియన్ డాలర్స స్థాయికి చేరనుంది. టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా, బోస్టన్ కన్సల్టింగ్‌ గ్రూప్ (బీసీజీ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కొనుగోలు ప్రక్రియలో ఏ దశలోనైనా కొనుగోలుదారు ఇంటర్నెట్‌ని వినియోగించిన పక్షంలో సదరు లావాదేవీని డిజటల్ మాధ్యమం ప్రభావిత లావాదేవీగా పరిగణించి ఈ నివేదికను రూపొందించారు. "ప్రస్తుతం కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మకాల్లో దాదాపు 28 శాతం విక్రయాలు డిజిటల్‌ మాధ్యమంతో ప్రభావితమైనవే ఉంటున్నాయి. 2023 నాటికి ఇది 63 శాతానికి పెరగవచ్చు. విలువపరంగా చూస్తే 23 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చు. ఇందులో సుమారు 10 బిలియన్ డాలర్ల మేర అమ్మకాలు ఆన్‌లైన్‌ విక్రయాలే ఉంటాయని అంచనా" అని నివేదిక వివరించింది. టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్‌లు, చిన్న చిన్న గృహోపకరణాలు, వాటర్ ప్యూరిఫయర్లు, మైక్రోవేవ్ ఒవెన్లు మొదలైన ఉత్పత్తుల ధరలపై దాదాపు 33 శాతం మేర డిజిటల్ ప్రభావం ఉంటోంది. 

కొనుగోలు నిర్ణయాలపై డిజిటల్ ప్రభావం...
నివేదిక ప్రకారం.. వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలపై డిజిటల్ మాధ్యమం ప్రభావం గణనీయంగా పెరుగుతోంది. ఇలా ప్రభావితమైన వారి సంఖ్య గడిచిన నాలుగేళ్లలో రెట్టింపయ్యింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వీరి సంఖ్య 5 రెట్లు పెరగ్గా, మహిళల కొనుగోలుదారుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. కొనుగోలు చేయడానికి ముందు దశలో దాదాపు 80 శాతం మంది డిజిటల్ ప్రభావిత కొనుగోలుదారుల్లో ఏ బ్రాండు కొనాలి వంటి అంశాలపై సందిగ్ధత ఉంటోంది. దీంతో వారు సగటున దాదాపు 2-3 వారాలు ఆన్‌లైన్‌లో అధ్యయనం చేసిన తర్వాతే కొనుగోలు చేస్తున్నారు. సెర్చి, సోషల్ మీడియా, బ్లాగ్‌లు, ఆన్‌లైన్ వీడియోలు మొదలైనవి ఆన్‌లైన్ రీసెర్చ్‌లో ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలు కూడా కొనుగోలుదారులకు చేరువయ్యేలా డిజిటల్ వ్యూహాలు అమలు చేస్తున్నాయని గూగుల్ ఇండియా కంట్రీ డైరెక్టర్ (సేల్స్‌) వికాస్ అగ్నిహోత్రి చెప్పారు. 



You may be interested

హైదరాబాద్‌ రియల్టీలో వృద్ధి

Wednesday 10th July 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉత్సాహం నెలకొంది. కొత్త గృహాల ప్రారంభాలు, కార్యాలయాల లావాదేవీల్లో వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ (హెచ్‌1) మధ్య కాలంలో నగరంలో కొత్త గృహాల లాంచింగ్స్‌లో 47 శాతం, ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీల్లో 43 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా 11వ ఎడిషన్‌ అర్ధ సంవత్సర నివేదిక తెలిపింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ బ్రాంచ్‌

విదేశాలకు వెళ్లాలనుకుంటే రూ.18,000 కోట్లు గ్యారంటీ ఇవ్వాలి

Wednesday 10th July 2019

నరేష్‌ గోయల్‌కు తేల్చిచెప్పిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌కు ఢిల్లీ హైకోర్టు గట్టి షాకిచ్చింది. విదేశాలకు వెళ్లాలనుకుంటే, ఆయన కంపెనీ (జెట్‌ఎయిర్‌వేస్‌) రుణదాతలకు బకాయి పడిన రూ.18,000 కోట్లను గ్యారంటీ కింద డిపాజిట్‌ చేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. దేశం విడిచి వెళ్లేందుకు గోయల్‌ చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. తనకు వ్యతిరేకంగా జారీ చేసిన లుకవుట్‌ సర్క్యులర్‌ (విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే, సంబంధిత వ్యక్తి పోలీసుల

Most from this category