News


ఎన్‌బీసీసీ-హెచ్‌ఎస్‌ఎస్‌సీ డీల్‌కు సీసీఐ పచ్చజెండా

Wednesday 24th October 2018
news_main1540360676.png-21430

 న్యూఢిల్లీ: కన్సల్టెన్సీ సంస్థ హెచ్‌ఎస్‌సీసీలో నూరు శాతం వాటా కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వరంగ నిర్మాణ సంస్థ ఎన్‌బీసీసీ ప్రతిపాదనకు కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అనుమతినిచ్చింది. అలాగే, హైదరాబాద్‌కు చెందిన జెమిని ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియాలో  (జీఈఎఫ్‌ ఇండియా) 25 శాతం వాటా కొనుగోలు చేసేందుకు సింగపూర్‌కు చెందిన బ్లాక్‌ రివర్‌ ఫుడ్‌కు అనుమతి మంజూరు చేసింది. సీఎల్‌పీ ఇండియాలో వాటాలను సొంతం చేసుకునేందుకు సీడీపీక్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏసియాకు అనుమతిచ్చినట్టు సీసీఐ తెలిపింది. నిర్ణీత శాతం దాటిన కొనుగోళ్లకు సీసీఐ అనుమతి తప్పనిసరి. హెచ్‌ఎస్‌సీసీ కేంద్ర ప్రభుత్వ అన్‌లిస్టెడ్‌ సంస్థ. ఇందులో 100 శాతం వాటా విక్రయానికి కేంద్రం బిడ్లను ఆహ్వానించగా... రూ.285 కోట్లతో కొనుగోలు చేసేందుకు ఎన్‌బీసీసీ ఎంపికైంది. You may be interested

లిస్టెడ్ ఎయిర్‌లైన్స్‌కు రేటింగ్‌ సెగ

Wednesday 24th October 2018

న్యూఢిల్లీ: పెరిగిపోతున్న వ్యయాలు లిస్టెడ్ విమానయాన సంస్థలకు రేటింగ్‌పరమైన తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. ఇండిగో, జెట్ ఎయిర్‌వేస్‌, స్పైస్‌జెట్‌ సంస్థల రుణాలను వివిధ రేటింగ్ సంస్థలు అక్టోబర్‌లో కుదించాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) పొందిన దాదాపు రూ. 8,000 కోట్ల విలువ చేసే బ్యాంక్ ఫెసిలిటీస్‌ దీర్ఘకాలిక రేటింగ్‌ను అక్టోబర్ 17న ఇక్రా కుదించింది. స్వల్పకాలిక రేటింగ్‌ను యథాతథంగానే కొనసాగించింది. అటు నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోవడం, ఇటు వాటిని

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ లాభంలో 20 శాతం వృద్ధి

Wednesday 24th October 2018

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బీమా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.287 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న నికర లాభం రూ.238.49 కోట్ల లాభంతో పోలిస్తే 20 శాతం పెరిగింది. స్థూల ప్రీమియం సైతం రూ.5,636 కోట్ల నుంచి రూ.6,840 కోట్లకు వృద్ధి చెందింది. నికర ప్రీమియం ఆదాయం రూ.5,389 కోట్ల నుంచి రూ.6,777 కోట్లకు పెరిగింది. కంపెనీ పేరును హెచ్‌డీఎఫ్‌సీ

Most from this category