STOCKS

News


వాల్‌మార్ట్‌-ఫ్లిప్‌కార్ట్ డీల్‌కు సీసీఐ ఆమోదం

Thursday 9th August 2018
news_main1533792444.png-19078

న్యూఢిల్లీ: దేశీ ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు చేసే ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్‌లో ట్వీట్ చేసింది. ఈ డీల్ విలువ దాదాపు 16 బిలియన్ డాలర్లు. ఫ్లిప్‌కార్ట్‌లో సుమారు 77 శాతం వాటాలను కొనుగోలు చేయనున్నట్లు వాల్‌మార్ట్ ఈ ఏడాది మేలో ప్రకటించింది. చిన్న వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ .. మూడు నెలల వ్యవధిలోనే డీల్‌కు సీసీఐ ఆమోదముద్ర వేయడం గమనార్హం. మరోవైపు సీసీఐ గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడాన్ని వాల్‌మార్ట్ స్వాగతించగా, ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ అత్యంత దురదృష్టకరమైన పరిణామంగా అభివర్ణించింది. దీనిపై కోర్టును ఆశ్రయించనున్నట్లు సీఏఐటీ పేర్కొంది. 



You may be interested

ఎన్‌ఎండీసీ లాభం రూ. 975 కోట్లు

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ మైనింగ్ దిగ్గజం ఎన్‌ఎండీసీ రూ. 975.27 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.969 కోట్లతో పోలిస్తే స్వల్ప వృద్ధి సాధించింది. మరోవైపు మొత్తం ఆదాయం రూ. 2,970 కోట్ల నుంచి రూ. 2,547 కోట్లకు తగ్గింది. బైలదిల్లా ప్రాజెక్టు విషయంలో పరిహారం కింద కలెక్టర్ లెక్క వేసినట్లుగా రూ. 7,241.35 కోట్లు డిపాజిట్

కేంద్రానికి ఆర్‌బీఐ రూ.50,000 కోట్ల డివిడెండ్‌

Thursday 9th August 2018

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 2018 జూన్‌తో ముగిసిన తన ఆర్థిక సంవత్సరంలో (2017-18) కేంద్రానికి రూ.50,000 కోట్ల డివిడెండ్‌ను చెల్లించనుంది. ఈ మొత్తం బడ్జెట్‌ అంచనాలకు అనుగుణంగానే ఉండడం గమనార్హం. అలాగే కేంద్ర ద్రవ్యలోటు కట్టడికి (ప్రభుత్వానికి వచ్చే ఆదాయం - చేసే వ్యయానికి మధ్య నికర వ్యత్యాసం) కూడా ఈ మొత్తం దోహదపడుతుందని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జూలై-జూన్‌ కాలాన్ని తన ఆర్థిక సంవత్సరంగా

Most from this category