STOCKS

News


4 ఏళ్లలో 47 శాతం వృద్ధి

Thursday 27th December 2018
Markets_main1545884556.png-23258

- పెరుగుతున్న సీఎస్‌ఆర్‌ వ్యయాలు
- కేపీఎమ్‌జీ ఇండియా సీఎస్‌ఆర్‌ రిపోర్టింగ్‌ సర్వే వెల్లడి

న్యూఢిల్లీ: సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద కార్పొరేట్‌ సంస్థలు చేస్తున్న వ్యయాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,536 కోట్లుగా ఉన్నాయి.  2014-15 ఆర్థిక సంవత్సరం సీఎస్‌ఆర్‌ వ్యయాలతో పోల్చితే ఇది 47 శాతం అధికమని కేపీఎమ్‌జీ ఇండియా సీఎస్‌ఆర్‌ రిపోర్టింగ్‌ సర్వే వెల్లడించింది. సీఎస్‌ఆర్‌ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలపై ఈ సర్వే ఇంకా ఏం చెప్పిందంటే..,
- 2014-15 నుంచి 2017-18 మధ్య కాలానికి టాప్‌ 100 కంపెనీల మొత్తం సీఎస్‌ఆర్‌ వ్యయాలు రూ.26,385 కోట్లకు పెరిగాయి.
- ఒక్కో కంపెనీ సగటు సీఎస్‌ఆర్‌ వ్యయం 2014-15లో రూ.59 కోట్లుగా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో 29 శాతం వృద్ధితో రూ.76 కోట్లకు ఎగసింది.
- సీఎస్‌ఆర్‌ కోసం కేటాయించి వ్యయం చేయని సొమ్ములు 2014-15లో రూ.1,738 కోట్లుగా ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.749 కోట్లు తగ్గి రూ.989 కోట్లకు పడిపోయింది.
- సీఎస్‌ఆర్‌ వ్యయాలు ప్రతి ఏడూ పెరుగుతూనే ఉన్నాయి. సీఎస్‌ఆర్‌ కమిటీ కార్యకలాపాలు చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుతున్నాయి. డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశాల్లో కూడా సీఎస్‌ఆర్‌ వ్యయాల ప్రస్తావన పెరుగుతోంది.
- ఇంధన, విద్యుత్తు రంగ కంపెనీలు అధికంగా సీఎస్‌ఆర్‌ కార్యకలాపాలను నిర్వహించాయి. ఈ రంగంలోని కంపెనీలు సీఎస్‌ఆర్‌ కోసం రూ.2,465 కోట్లు ఖర్చు చేశాయి. ఆ తర్వాతి స్థానాల్లో బీఎఫ్‌ఎస్‌ఐ(రూ.1,353 కోట్లు), వినియోగ వస్తు కంపెనీలు(రూ.635 కోట్లు), ఐటీ కన్సల్టింగ్‌, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, లోహ, మైనింగ్‌ కంపెనీలు నిలిచాయి.
- సీఎస్‌ఆర్‌ నిధులను అధికంగా ఖర్చు చేసిన రాష్ట్రాలుగా మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, కర్ణాటకలు నిలిచాయి.



You may be interested

స్థిరంగా పసిడి ధర

Thursday 27th December 2018

ప్రపంచమార్కెట్లో గురువారం పసిడి ధర 1270డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. అమెరికాలో నెలకొన్న రాజకీయ అస్థితర, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనలు పసిడి ర్యాలీకి మద్దతనిస్తున్నాయి. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2.50డాలర్లు పెరిగి 1,272.30 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతరాత్రి అమెరికా మార్కెట్లో ఈక్విటీ షేర్లతో పాటు ట్రెజరీ బాండ్‌ ఈల్డ్‌‍్స పెరగడంతో డాలర్‌ ఇండెక్స్‌ 4నెలల కనిష్టం నుంచి కోలుకోవడంతో

తగ్గిన రూపాయి

Thursday 27th December 2018

ప్రపంచ మార్కెట్లో క్రూడ్‌ ధర 8 శాతం పెరిగిన కారణంగా గురువారం రూపాయి బలహీనపడింది. ముంబైలోని ఇం‍టర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ప్రారంభంలో అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి 18 పైసల మేర తగ్గి 70.25 స్థాయి వద్దకు దిగింది. ఇటీవల క్రూడ్‌ ధరలు పతనమైన నేపథ్యంలో రూపాయి 69.70 వరకూ ర్యాలీ జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా 70.21 వద్ద ప్రారంభమైన రూపాయి 70.27 కనిష్టస్థాయికి పడిపోయి, ఉదయం

Most from this category