STOCKS

News


మన డేటా మన దగ్గరే ఉండాలి..

Tuesday 18th June 2019
news_main1560838910.png-26376

  • దేశ ప్రయోజనాలకు ఉపయోగపడాలి
  • విదేశాల్లో భద్రపర్చడం శ్రేయస్కరం కాదు
  • కేంద్ర మంత్రితో భేటీలో ఈ కామర్స్ వర్గాలు

న్యూఢిల్లీ: దేశీ యూజర్ల డేటా... మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడాలని, ఇతర దేశాల్లో దీన్ని భద్రపర్చడం శ్రేయస్కరం కాదని ఈ-కామర్స్ కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఈ-కామర్స్‌లో విదేశీ ప‍్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల ఉల్లంఘనలు జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్‌తో సోమవారం సమావేశమైన వివిధ డిజిటల్ కామర్స్ కంపెనీల ప్రతినిధులు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ దేశీ వినియోగదారుల డేటాను దేశ ప్రయోజనాలకు తోడ్పడేలా ఉపయోగించాలని తెలిపారు. మరోవైపు, దేశీ ఈకామర్స్‌ కంపెనీలకు, విదేశీ ఈ కామర్స్ సంస్థలకు నిబంధనలు వేర్వేరుగా ఉండటం వల్ల కంపెనీలు సమాన అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాయని మరో డిజిటల్ కామర్స్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. విదేశీ సంస్థల నుంచి దేశీ కంపెనీలకు పొంచి ఉన్న ముప్పు, అందరికీ సమాన అవకాశాల కల్పన, వివక్షాపూరిత విధానాలు మొదలైన అంశాలన్నీ ఇందులో చర్చకు వచ్చాయి. తదుపరి మరింత వివరాలేమైనా ఇవ్వదల్చుకుంటే వచ్చే వారం తెలియజేయాలంటూ మంత్రి ఈ-కామర్స్ సంస్థల వర్గాలకు సూచించారు. జాతీయ ఈ-కామర్స్ విధానాన్ని ఖరారు చేసే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో పరిశ్రమ వర్గాలతో మంత్రి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 



You may be interested

భారతీ ఆక్సా జనరల్‌కు లాభాలు

Tuesday 18th June 2019

ప్రీమియం ఆదాయంలో 29 శాతం ప్రగతి ముంబై: భారతీ ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభాలను ఆర్జించినట్టు ప్రకటించింది. ప్రీమియం వసూళ్లలో 29 శాతం వృద్ధిని సాధించామని, ఇది పరిశ్రమ వృద్ధి రేటు కంటే ఎక్కువని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో స్థూల రిటన్‌ ప్రీమియం (జీడబ్ల్యూపీ) రూ.2,285 కోట్లుగా నమోదయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సంలో ఇది రూ.1,772 కోట్లుగా ఉంది. అన్ని రకాల బీమా

హీరోమోటో కార్ప్‌ ప్రచారకర్తగా ఫెర్నాండో మినా

Tuesday 18th June 2019

న్యూఢిల్లీ: ప్రముఖ కొలంబియా ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు ‘ఎర్రి ఫెర్నాండో మినా’ను తమ కంపెనీ నూతన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు హీరోమోటో కార్ప్‌ సోమవారం ప్రకటించింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కొలంబియా ద్విచక్ర వాహన మార్కెట్‌లో పట్టుపెంచుకోవడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త ప్రీమియం మోటార్ సైకిళ్ళు, హై-పవర్‌ స్కూటర్లు, అధునాతన సాంకేతిక ద్విచక్ర వాహనాలను అక్కడి మార్కెట్లో ప్రవేశపెడుతుండగా.. ఈ సమయంలో యువతను ఆకట్టుకోగలిగే విధంగా

Most from this category