STOCKS

News


జిల్లాల్లోనూ సీఎన్‌జీ స్టేషన్లు!

Saturday 15th December 2018
news_main1544848713.png-22947

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుతం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) స్టేషన్లు వివిధ జిల్లాల్లో కూడా ఏర్పాటు కానున్నాయి. వచ్చే మార్చి నాటికి హైదరాబాద్‌లో కొత్తగా 25, వరంగల్, కరీంనగర్‌ వంటి జిల్లాల్లో 15 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయిల్‌ ఇండస్ట్రీ తెలంగాణ స్టేట్‌ లెవల్‌ కో–ఆర్డినేటర్‌ టి.రాజేశ్‌ ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’కు తెలిపారు. ఒక్క సీఎన్‌జీ స్టేషన్‌ ఏర్పాటుకు రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని... ఆయా ప్రాంతాల్లో సీఎన్‌జీ వాహనాలను బట్టి సంఖ్యను మరింత పెంచుతామని ఆయన తెలియజేశారు. హైదరాబాద్‌లో సీఎన్‌జీ సప్లయి హక్కులు భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌కు (బీజీఎల్‌) ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో సుమారు 25 వేల సీఎన్‌జీ వాహనాలు, 35 స్టేషన్లున్నాయి. గుజరాత్‌లో 409, మహారాష్ట్ర 254, న్యూఢిల్లీలో 424 స్టేషన్లున్నాయి. ‘తెలంగాణలో రిటైల్‌ ఔట్‌లెట్స్‌ విస్తరణ’ కార్యక్రమంలో భాగంగా గురువారమిక్కడ ఐఓసీఎల్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ దీపక్‌ దాస్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పూర్తి వివరాలివివీ..
కొత్తగా 3,531 పెట్రోల్‌ బంక్‌లు..
ప్రస్తుతం దేశంలో 65 వేల పెట్రోల్‌ బంక్‌లున్నాయి. తెలంగాణలో 2,430, ఆంధ్రప్రదేశ్‌లో 3,380 పెట్రోల్‌ బంకులున్నాయి. కొత్తగా తెలంగాణలో 3,531 పెట్రోల్‌ బంక్‌లను ఏర్పాటు చేసేందుకు డీలర్‌షిప్స్‌ను ఆహ్వానిస్తున్నాం. దీన్లో భాగంగా తొలిదశలో హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) తరఫున 116, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌) 1,971, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) 185 బంక్‌లను ఏర్పాటు చేస్తాం. 6–7 ఏళ్ల వ్యవధిలో మొత్తం బంక్‌లను ఏర్పాటు చేస్తాం.
కనీస పెట్టుబడి రూ.35–40 లక్షలు..
కొత్తగా రానున్న పెట్రోల్‌ బంక్‌లు అభివృద్ధి చెందుతున్న జాతీయ రహదారులు, పారిశ్రామిక కేంద్రాలు, వ్యవసాయ క్షేత్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం, అర్బన్‌లో 40 శాతం బంక్‌లను ఏర్పాటు చేస్తాం. ఒక్క పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటుకు స్థల వ్యయం కాకుండా అర్బన్‌లో రూ.50–60 లక్షలు, రూరల్‌లో రూ.35–40 లక్షలు, హైవేస్‌లో రూ.80–90 లక్షల వరకు అవుతుంది. 
లీటరు మీద రూ.3.10 లాభం..
దేశంలోనే పెట్రోల్, డీజిల్‌ వినియోగంలో హైదరాబాద్‌ మూడో స్థానంలో ఉంది. ఏటా పెట్రోల్‌ 8 శాతం, డీజిల్‌ వినియోగం 4 శాతం పెరుగుతుంది. ఏటా హెచ్‌పీసీఎల్‌ అమ్మకాలు 3.5 కోట్ల మెట్రిక్‌ టన్నులు, బీపీసీఎల్‌ 3.9 కోట్ల మెట్రిక్‌ టన్నులు, ఐఓసీఎల్‌ 5.5 మెట్రిక్‌ టన్నులుగా ఉన్నాయి. ఒక్క లీటర్‌ పెట్రోల్‌ అమ్మకంపై డీలర్‌కు రూ.3.10, డీజిల్‌పై రూ.2.10, ఆయిల్‌ కంపెనీలకు 83 పైసలు లాభం ఉంటుంది. ఒక్క పెట్రోల్‌ బంక్‌లో సుమారు 15–20 మంది ఉద్యోగులు అవసరముంటారు.
 
 You may be interested

హైదరాబాద్‌లో మానవ రహిత విమానాల తయారీ

Saturday 15th December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగంలో భాగ్యనగరం సిగలో మరో కలికితురాయి చేరింది. మానవ రహిత విమానాల (యూఏవీ) తయారీకి హైదరాబాద్‌ కేంద్రం అయింది. విభిన్న రంగాల్లో ఉన్న అదానీ గ్రూప్‌... తన అనుబంధ సంస్థ అదానీ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ ద్వారా ఈ రంగంలోకి అడుగుపెట్టింది. ఇజ్రాయెల్‌ దిగ్గజం ఎల్బిట్‌ సిస్టమ్స్‌తో కలిసి సంయుక్తంగా శంషాబాద్‌ సమీపంలో 20 ఎకరాల్లో అదానీ ఎల్బి్‌ట్‌ యూఏవీ కాంప్లెక్స్‌ను ఏర్పాటు

సెంట్రల్‌ బ్యాంకులకు నిర్వహణ స్వతంత్రత అవసరం

Saturday 15th December 2018

వాషింగ్టన్‌: తమ బాధ్యతల నిర్వహణ విషయంలో సెంట్రల్‌ బ్యాంకులకు నిర్వహణపరమైన స్వతంత్రత అన్నది ఎంతో ముఖ్యమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) డైరెక్టర్‌ జెర్రీరైస్‌ అన్నారు. ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామాతో భారత ఆర్‌బీఐ స్వతంత్రత విషయమై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మీడియా ప్రశ్నించగా, రైస్‌ స్పందించడం గమనార్హం. కొన్ని అంశాల విషయంలో కేంద్రం, ఆర్‌బీఐ మధ్య కొంత కాలంగా విభేదాలు నెలకొనడం, ఉర్జిత్‌ ఆకస్మికంగా రాజీనామా చేయడం

Most from this category