STOCKS

News


అక్టోబర్‌ నుంచి ఆకాశ వీధిలో డ్రోన్స్‌ సందడి!

Wednesday 18th July 2018
news_main1531898215.png-18434

పౌర అవసరాల నిమిత్తం వాడే డ్రోన్స్‌(మానవ రహిత సూక్ష్మతర విమానాలు) వచ్చే అక్టోబర్‌ నుంచి భారత గగనతలంలో సందడికి సిద్ధమవుతున్నాయి. వీటి విహారానికి కావలిసిన నియమనిబంధనలను, నియంత్రణా విధానాలను పౌరవిమానయాన శాఖ త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలిసింది. పౌరఅవసరాల కోసం వాడే డ్రోన్స్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకునే వ్యవస్థను రూపొందిస్తున్నామని పౌర విమానయాన కార్యదర్శి ఆర్‌ఎన్‌ చౌబే చెప్పారు. అక్టోబర్‌ నుంచి ఈ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, ఎగిరే అనుమతులు ఆరంభం కావచ్చని చెప్పారు. ప్రస్తుతం విమానయాన నియంత్రణా నియమావళి ప్రకారం డ్రోన్లను పౌర అవసరాల కోసం వాడడం భారత్‌లో నిషిద్ధం. ఈ నేపథ్యంలో పౌర డ్రౌన్స్‌ ముసాయిదా నిబంధనలను గతేడాది ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ప్రతి డ్రోన్‌కు ఒక విశిష్ఠ గుర్తింపు సంఖ్య ఉంటుంది. నానోడ్రోన్స్‌కు ఈ సంఖ్యతో పనిలేదు. నానోడ్రోన్స్‌కు వన్‌టైమ్‌ అనుమతి అవసరం. దీంతో పాటు వివిధ అవసరాలకు వాడే పలు రకాల డ్రోన్లకు సంబంధించిన నియమాలను ఈ ముసాయిదాలో పొందుపరిచారు. దేశంలో కొన్ని ప్రాంతాలను, దేశ సరిహద్దుల నుంచి 50 కిలోమీటర్ల వరకు ‘నోడ్రోన్‌’ జోన్‌గా ప్రకటిస్తారు. ప్రస్తుతం ఈ డ్రోన్ల విషయంలో తీసుకోవాల్సిన విధివిధానాలపై విమానయాన మంత్రి జయంత్‌ సిన్హాతో కూడిన 13 మంది సభ్యుల టాస్క్‌ఫోర్స్‌ ఆలోచనలు జరుపుతోంది. 



You may be interested

కళ తప్పిన లోహ షేర్లు..!

Wednesday 18th July 2018

ముంబై:- క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో ర్యాలీ చేసిన లోహ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో పాటు, ప్రపంచమార్కెట్లో లోహా ధరల పతనంతో బుధవారం లోహ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో లోహ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ సూచి మంగళవారం 3.30 శాతం పైగా క్షీణించింది. మధ్యాహ్నం గం.12:30లకు నిఫ్టీ మెటల్‌ గత ముగింపు 3223 పాయింట్లతో పోలిస్తే 2.63శాతం నష్టంతో 3,138 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

52 వారాల గరిష్టానికి 29 స్టాక్స్‌..

Wednesday 18th July 2018

జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ, ఏసియన్‌ పెయింట్స్‌ బీఎస్‌ఈలో బుధవారం మార్నింగ్‌ సెషన్‌లో 29 స్టాక్స్‌ 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి. వీటిల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌ఈజీ, లార్సెన్‌ అండ్‌ టుబ్రో, ఇన్ఫోటెక్‌, ఏసియన్‌ పెయింట్స్‌, ఎన్‌వైర్‌ ఎలక్ట్రో, అట్లాస్‌ జువెలరీ, దోలత్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, శ్రీ సర్గోవింద్‌, ఎలక్ట్రోస్టీల్‌, డెక్కన్‌ బేరింగ్స్‌, సిగ్నిటీ టెక్‌, స్వరాజ్‌ ఆటోమోటివ్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్, దన్లా టెక్నాలజీస్‌, ఆస్ట్రల్‌ పాలీ టెక్‌, ప్రో ఫిన్‌ క్యాపిటల్‌

Most from this category