STOCKS

News


ఎయిర్‌ ఇండియాకు రూ.11,000 కోట్ల బెయిలవుట్‌ ప్యాకేజీ!

Wednesday 8th August 2018
news_main1533704075.png-19034

ముంబై: తీవ్ర కష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ విమానయాన సేవల సంస్థ ఎయిర్‌ ఇండియాకు రూ.11,000 కోట్ల బెయిలవుట్‌ ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై కేంద్ర పౌర విమానయాన శాఖ, ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని చెప్పాయి. నష్టాల్లో ఉన్న ఎయిర్‌ ఇండియాను ప్రైవేటు పరం చేద్దామనుకున్న ప్రయత్నాలు విఫలం కావడంతో ప్యాకేజీ ఇచ్చే ప్రతిపాదన ముందుకు రావడం గమనార్హం. భారంగా మారిన రుణాలను కొంత వరకు తగ్గించుకునేందుకు ఈ నిధులను వినియోగించనుంది. ‘‘ఎయిర్‌ ఇండియా బ్యాలన్స్‌ షీటును మెరుగుపరచడం వల్ల వ్యూహాత్మక విక్రయానికి ప్రభుత్వం తిరిగి ప్రయత్నించినప్పుడు అది ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారుతుంది’’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఎయిర్‌ ఇండియాకు పూర్వపు యూపీఏ హయాంలో 2012లో ఒకసారి బెయిలవుట్‌ ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. ఈ సంస్థకు 2017 మార్చి నాటికి రూ.48,000 కోట్ల రుణ భారం ఉంది. గత నెలలో రూ.980 కోట్ల మేర సప్లిమెంటరీ గ్రాంట్స్‌ కింద ఎయిర్‌ ఇండియాకు ఇచ్చేందుకు కేంద్రం పార్లమెంటు ఆమోదం కోరిన విషయం తెలిసిందే. 



You may be interested

భారీ విస్తరణ ప్రణాళికలో ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్

Wednesday 8th August 2018

పశ్చిమబెంగాల్: పారిశ్రామిక, వాహన బ్యాటరీలను ఉత్పత్తి చేసే ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ భారీ విస్తరణ ప్రణాళికను చేపట్టింది. రీసైకిల్ లిడ్‌ నుంచి తుది వస్తువు వరకు బ్యాటరీల ఉత్పత్తికి అవసరమైన అన్ని విభాగాలను ఒకేచోట ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం పశ్చిమబెంగాల్‌లోని పోర్ట్‌ సిటీ హల్దియాలో ఇప్పటికే ఉన్నటువంటి ప్లాంట్‌ను మరింత విస్తరించనుంది. ఆగ్నేయాసియాలో అతి పెద్ద యూనిట్‌ను ఏర్పాటుచేయడంలో భాగంగా మరో రెండు ప్రాజెక్టులకు కంపెనీ సీఈఓ గౌతం ఛటర్జీ మంగళవారం

3వ వారంలో జైట్లీ తిరిగి  బాధ్యతలు!

Wednesday 8th August 2018

న్యూఢిల్లీ: ఆర్థికమంత్రిగా అరుణ్‌జైట్లీ ఈ నెల 3వ వారం నుంచీ తిరిగి  బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.  కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను పురస్కరించుకుని ఏప్రిల్‌ ప్రారంభం నుంచీ ఆయన ఆర్థికశాఖ కార్యాలయానికి రాలేదు. మే 14వ తేదీన 65 సంవత్సరాల జైట్లీకి ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ జరిగింది. అటు కొద్దిరోజుల తర్వాత అప్పుడప్పుడూ  ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ట్వీట్స్‌ చేస్తున్నప్పటికీ, తాత్కాలికంగా ఆ బాధ్యతలను రైల్వే,

Most from this category