STOCKS

News


భారత్‌లో మరిన్ని పెట్టుబడులు

Saturday 15th September 2018
news_main1536987320.png-20272

న్యూఢిల్లీ: నూతన ఆవిష్కరణలకు తోడ్పాటునిచ్చే దిశగా రెండో విడత 'కంట్రీ డిజిటల్ యాక్సిలరేషన్' (సీడీఏ) కార్యక్రమం కింద భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికా టెక్ దిగ్గజం సిస్కో సీఈవో చక్ రాబిన్స్ తెలిపారు. దీంతో సీడీఏ కింద రెండో విడత ఇన్వెస్ట్‌మెంట్స్ అందుకున్న అతి కొద్ది దేశాల్లో భారత్‌ కూడా ఒకటిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పౌరులకు మెరుగైన సర్వీసులు అందించడంలో 5జీ టెక్నాలజీని మరింతగా వినియోగంలోకి తేవడంపైనా దృష్టి సారిస్తున్నట్లు రాబిన్స్ తెలిపారు. ఇప్పటికే నీతి ఆయోగ్‌, భారత్ సంచార్ నిగమ్ (బీఎస్‌ఎన్ఎల్‌)తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆయన వివరించారు. సీడీఏ తొలి విడతలో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో సిస్కో 50 ప్రాజెక్టులు పూర్తి చేసింది. వీటిలో 10 ఇన్నోవేషన్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. అటల్ ఇన్నోవేషన్ మిషన్‌ ద్వారా చేయబోయే కొత్త పెట్టుబడులు.. వినూత్న డిజిటల్ టెక్నాలజీలతో పాటు పౌర సేవల్లో 5జీ సాంకేతిక వినియోగాన్ని పెంచే కొత్త ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు ఉద్దేశించినట్లు రాబిన్స్ పేర్కొన్నారు. 



You may be interested

అమ్మ కోరిక... పిటిషన్‌ ఉపసంహరణ

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ మాజీ ప్రమోటర్‌ శివిందర్‌ మోహన్‌ సింగ్‌... తన అన్న మల్వీందర్‌ మోహన్‌ సింగ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటీషన్‌ను ఉపసంహరించుకోవడానికి ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది. రెలిగేర్‌ మాజీ అధినేత సునీల్‌ గో‍ధ్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటీషన్‌ను కూడా ఉపసంహరించుకోవడానికి ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది. తమ మధ్య ఉన్న విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తన తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కోరారని, వారి కోరిక మేరకు ఈ పిటీషన్లను

కుటుంబ వ్యాపారాల్లో భారత్‌ మేటి

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: కుటుంబాల ఆధ్వర్యంలో నడిచే వ్యాపార సంస్థలు ఆయా రంగాల్లోని ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే పనితీరులో మెరుగ్గా ఉండడంతోపాటు, వాటాదారులకు అధిక రాబడులు పంచిపెడుతున్నాయి. కుటుంబాల ఆధ్వర్యంలోని కంపెనీలు సంఖ్యా పరంగా చైనా, అమెరికా తర్వాత భారత్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ వివరాలను ‘క్రెడిట్‌ సూసే ఫ్యామిలీ 1000, 2018’ నివేదిక పేరుతో క్రెడిట్‌ సూసే రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ విడుదల చేసింది. భారత్‌లో 111 వ్యాపార సంస్థలు కుటుంబాల ఆధ్వర్యంలో

Most from this category