STOCKS

News


సిప్లా లాభం రూ.451 కోట్లు

Thursday 9th August 2018
news_main1533792552.png-19080

న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సిప్లా నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 10 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.409 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.451 కోట్లకు పెరిగిందని సిప్లా తెలియజేసింది. అమెరికాలో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, భారత్‌, దక్షిణాఫ్రికాల్లో అమ్మకాలు జోరుగా ఉండటంతో ఈ క్యూ1లో ఈ స్థాయి నికర లాభం సాధించామని  సిప్లా ఎమ్‌డీ, గ్లోబల్‌ సీఈఓ ఉమాంగ్‌ వోహ్రా చెప్పారు. మొత్తం ఆదాయం రూ.3,525 కోట్ల నుంచి రూ.3,939 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయంలో 39 శాతంగా ఉన్న భారత వ్యాపార ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.1,544 కోట్లకు పెరిగింది. ఇబిటా మార్జిన్‌ 3.3 శాతం పెరిగి 18.4 శాతానికి చేరింది.
పోటీ తక్కువగా ఉండే ఔషధాలను అమెరికా మార్కట్లో విడుదల చేశామని, అంచనాలకనుగుణంగానే అవి అమ్మకాలు సాధిస్తున్నాయని ఉమాంగ్‌ వెల్లడించారు. రానున్న వారాల్లో మరిన్ని ఆసక్తికరమైన ఔషధాలను అమెరికా మార్కెట్లోకి తేనున్నామని తెలిపారు. కంపెనీ గ్లోబల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా ఆర్‌. అనంత నారాయణన్‌ను నియమించామని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో సిప్లా షేర్‌ 0.75 శాతం లాభంతో రూ.633 వద్ద ముగిసింది. 
 You may be interested

ఎల్‌ఐసీతో విలీనానికి ఐడీబీఐ బ్యాంక్‌కు అనుమతులు

Thursday 9th August 2018

ముంబై: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీతో డీల్‌కి సంబంధించి కేంద్రం నుంచి ఆమోదముద్ర లభించినట్లు ఐడీబీఐ బ్యాంక్‌ వెల్లడించింది. రుణ సంక్షోభంలో ఉన్న ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ 51 శాతం వాటా కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ ప్రతిపాదనకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా తమ సంస్థలో ప్రభుత్వ వాటాను 50 శాతం లోపునకు తగ్గించుకునేందుకు, యాజమాన్య అధికారాలు వదులుకునేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం

ఎన్‌ఎండీసీ లాభం రూ. 975 కోట్లు

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ మైనింగ్ దిగ్గజం ఎన్‌ఎండీసీ రూ. 975.27 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.969 కోట్లతో పోలిస్తే స్వల్ప వృద్ధి సాధించింది. మరోవైపు మొత్తం ఆదాయం రూ. 2,970 కోట్ల నుంచి రూ. 2,547 కోట్లకు తగ్గింది. బైలదిల్లా ప్రాజెక్టు విషయంలో పరిహారం కింద కలెక్టర్ లెక్క వేసినట్లుగా రూ. 7,241.35 కోట్లు డిపాజిట్

Most from this category