STOCKS

News


ఐదు ఐటీ కంపెనీలు... 4.8 శాతం వృద్ది

Friday 4th January 2019
news_main1546592426.png-23412

సీఐఎంబీ అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాల సీజన్‌ షురూ కానుంది. ఈ నెల 10న టీసీఎస్‌, 11న ఇన్ఫోసిస్‌ ఫలితాల వెల్లడితో సీజన్‌ ఆరంభమవుతోంది. రూపాయి పతనం, యూఎస్‌లో వృద్ధి కారణంగా ఈసారి ఫలితాల్లో ఐటీ సంస్థలు మంచి జోరు చూపవచ్చని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దేశంలో టాప్‌ 5 ఐటీ కంపెనీలు సరాసరిన 1.5- 4.8 శాతం వృద్ది నమోదు చేయవచ్చని గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ సీఐఎంబీ అంచనా వేస్తోంది. ఇన్ఫోసిస్‌ తన ఆర్థిక సంవత్సర రెవెన్యూ వృద్ధి అంచనా దిగువ అవధిని పెంచవచ్చని తెలిపింది. అదేవిధంగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ డాలర్‌ రెవెన్యూ గైడెన్స్‌ను యథాతధంగా కొనసాగించవచ్చని అభిప్రాయపడింది. లార్జ్‌ క్యాప్స్‌లో ఇన్ఫోసిస్‌; టెక్‌మహీంద్రాలపై ఓవర్‌వెయిట్‌గా ఉన్నట్లు తెలిపింది. మిడ్‌క్యాప్స్‌లో ఎన్‌ఐఐటీ, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ షేర్లను రికమండ్‌ చేసింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి డాలర్‌ రెవెన్యూ గ్రోత్‌ 7- 9 శాతం ఉండొచ్చని, ఎబిటా మార్జిన్‌ తగ్గవచ్చని ఇన్ఫోసిస్‌ గత ఫలితాల సమయంలో అంచనా వేసింది. అదేవిధంగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ సంస్థ 9.5- 11.5 శాతం రెవెన్యూ గ్రోత్‌, 19.5- 20.5 శాతం ఎబిటా మార్జిన్‌ను అంచనా వేసింది. 



You may be interested

ఫార్మా ఫలితాలపై క్రెడిట్‌ సూసీ అంచనాలు

Friday 4th January 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అరబిందో ఫార్మా, టొరెంట్‌ ఫార్మా, కాడిలా హెల్త్‌కేర్‌ కంపెనీలు బలమైన ఫలితాలు నమోదు చేస్తాయని అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ క్రెడిట్‌ సూసీ అంచనా వేసింది. ఇదే సమయంలో సిప్లా, డా.రెడ్డీస్‌ పేలవ ఫలితాలు చూపుతాయని అభిప్రాయపడింది. సన్‌ఫార్మా ఫలితాలు ఇలుమ్యా మందు కారణంగా బాగానే ఉండొచ్చని కానీ ఎబిటా మాత్రం దెబ్బతింటుందని, అధిక ప్రమోషన్‌ వ్యయాలే ఇందుకు కారణమని వివరించింది. డా.రెడ్డీస్‌ ఫలితాల్లో

రియల్టీ ఇండెక్స్‌ 1 శాతం అప్‌

Friday 4th January 2019

 రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్స్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 1శాతం ర్యాలీ చేసింది. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(233.95)తో పోలిస్తే 0.75శాతం లాభంతో 235.45ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఓబేరాయ్‌ రియల్టీ 3శాతం ర్యాలీ చేయగా, ఫోనిక్స్‌ లిమిటెడ్‌ 2శాతం, గోద్రేజ్‌ పాపర్టీస్‌, డీఎల్‌ఎఫ్‌ 1శాతం పెరిగాయి. యూనిటెక్‌ అరశాతం లాభపడింది. మరోవైపు శోభ 3.50శాతం నష్టపోగా, సన్‌టెక్‌ 1.50శాతం, ప్రెస్టేజ్‌ 1శాతం,

Most from this category