STOCKS

News


అలాగైతే ‘షాక్‌’ తప్పదు

Tuesday 11th June 2019
news_main1560229104.png-26221

  • ‘ఎలక్ట్రిక్‌’ను బలవంతంగా రుద్దకూడదు
  • వినియోగదారుల సహకారం అవసరం
  • చార్జింగ్‌ వంటి మౌలిక సదుపాయాలుండాలి
  • వాహన పరిశ్రమ స్పందన

న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగానికి సంబంధించి తగిన ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వానికి సియామ్‌ (సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌) సూచించింది. ఈ ప్రణాళిక అదరాబాదరగా కాకుండా, వాస్తవిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలని పేర్కొంది. 
ఐసీఈ అమ్మకాలపై నిషేధం...
టూ, త్రీ వీలర్లలో ఉపయోగించే ఇంటర్నల్‌ కంబశ్చన్‌ ఇంజిన్‌ల (ఐసీఈ) అమ్మకాలను 2025 కల్లా నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలు వచ్చాయి. ఈ వార్తల ప్రకారం 2023 కల్లా త్రీ వీలర్లలో ఉపయోగించే ఐసీఈలను, 2025 కల్లా టూ వీలర్లలో ఉపయోగించే ఐసీఈలను ప్రభుత్వం నిషేధించనుంది.  అయితే ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఐసీఈల అమ్మకాలను ఇంత త్వరితంగా నిషేధించడం సరైన చర్య కాదని టూ వీలర్‌ దిగ్గజ కంపెనీలు వ్యాఖ్యానించాయి. ఇలాంటి చర్య వాహన పరిశ్రమనే అతలాకుతలం చేసే అవకాశాలున్నాయని హెచ్చరించాయి. 
ఆచరణ యోగ్యం కాదు: రాజీవ్‌ బజాజ్‌ 
ఐసీఈల అమ్మకాలను నిషేధించాలన్న ప్రభుత్వ ప్రతిపాదన ఆచరణ యోగ్యం కాదని బజాజ్‌ ఆటో ఎమ్‌డీ రాజీవ్‌ బజాజ్‌ పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం ఏ కంపెనీ కూడా సరైన స్థాయిలో ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేయడం లేదన్నారు. బీఎస్‌ సిక్స్‌ ప్రమాణాల అమలు త్వరలోనే ప్రారంభం కానున్నదని, అప్పుడే దానికి గడువును నిర్దేశించడం సరైనది కాదని పేర్కొన్నారు. కార్లకు మినహాయింపు ఇచ్చి, టూ, త్రీవీలర్లను టార్గెట్‌ చేయడం ద్వారా ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రోత్సాహామివ్వాలనే చర్య అసంపూర్తిగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌లో కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో 2023 నుంచి లేదా 2025 నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాలనే అనుమతించేలా మధ్యే మార్గాన్ని అనుసరించాలని ఆయన సూచించారు. ఈ నగరాల్లో వచ్చిన అనుభవాల ఆధారంగా సమగ్రమైన ప్రణాళికను రూపొందించడం సముచితంగా ఉంటుందని పేర్కొన్నారు. 
వాహన పరిశ్రమపై ప్రభావం...
ప్రజలంతా ఎలక్ట్రిక్‌ టూ, త్రీ వీలర్లను వాడాల్సిందిగా బలవంతంగా అవాస్తవిక గడువును రుద్దడం సరైన చర్య కాదని టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ చైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ వ్యాఖ్యానించారు. ఇది వినియోగదారుల్లో అసంతృప్తిని పెంచుతుందని, అంతేకాకుండా 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న వాహన పరిశ్రమనే అతలాకుతలం చేస్తుందని హెచ్చరించారు.  ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచేలా దశలవారీగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వినియోగదారుల సహకారంతోనే ఇలాంటివి సాకారమవుతాయని పేర్కొన్నారు. వాహనాల చార్జింగ్‌కు చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, బ్యాటరీల లభ్యత తదితర అవసరాలను తీర్చేలా మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉందని వివరించారు. 
కాగా, ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకానికి సంబంధించిన లక్ష్యాలను, గడువు తేదీలపై అందర్నీ సంప్రదించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని పరిశ్రమల సమాఖ్య, సీఐఐ కూడా సూచించింది. 



You may be interested

మ్యాక్స్‌ బూపాతో చేయి కలిపిన ఐడీబీఐ బ్యాంకు

Tuesday 11th June 2019

హైదరాబాద్‌: ఐడీబీఐ బ్యాంకు, మ్యాక్స్‌ బూపా కార్పొరేట్‌ ఏజెన్సీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఐడీబీఐ ఖాతాదారులకు సమగ్ర ఆరోగ్య బీమా ఉత్పత్తులను మ్యాక్స్‌ బూపా ఆఫర్‌ చేస్తుంది. ఐడీబీఐ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 1,800 శాఖలతోపాటు 2 కోట్ల ఖాతాదారులున్నారు. ఐడీబీఐ బ్యాంకు ఎండీ, సీఈవో రాకేశ్‌ శర్మ మాట్లాడుతూ... ఖాతాదారుల అవసరాలను గుర్తించడంతోపాటు వారికి అనువైన ఆర్థిక ఉత్పత్తులను అందిస్తుంటామని, ఇందులో భాగమే మ్యాక్స్‌ బూపాతో ఒప్పందమని

నాలుగో నెల్లోనూ మారుతీ కోత

Tuesday 11th June 2019

18 శాతం తగ్గిన వాహన తయారీ  డిమాండ్‌ మందగమనమే కారణం న్యూఢిల్లీ: వాహన దిగ్గజం, మారుతీ సుజుకీ ఇండియా గత నెలలో వాహన ఉత్పత్తిని 18 శాతం తగ్గించింది. ఈ కంపెనీ వాహనాల ఉత్పత్తిలో కోత విధించడం ఇదివరుసగా నాలుగో నెల. మారుతీ సుజుకీ ఇండియా ఈ మేరకు స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు నివేదించింది. వివరాలివీ... - గత ఏడాది మేలో ఈ కంపెనీ 1,84,612 వాహనాలను తయారు చేసింది. - ఈ ఏడాది మే నెలలో

Most from this category