STOCKS

News


యాక్సిస్‌ బ్యాంక్‌లో వాటా విక్రయం వాయిదా

Saturday 6th October 2018
news_main1538813459.png-20921

ముంబై:- ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న అస్థిరత కారణంగా యాక్సిస్‌ బ్యాంకులో ప్రభుత్వం తన వాటా విక్రయాన్ని వాయిదా వేసింది. ఈ నవంబర్‌ చివరినాటి కల్లా యాక్సిస్‌ బ్యాంకులోని తన మొత్తం వాటాలో 4శాతం వాటాను విక్రయించి రూ.7,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం భావించింది. సెకండరీ మార్కెట్లో ఆగస్ట్‌ చివరి నాటి నుంచి తలెత్తిన సంక్షోభంతో వాటా విక్రయ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. ఇటీవల మార్కెట్లో నెలకొన్న గడ్డు పరిస్థితి నిధుల ఉపసంహరణకు ప్రధాన అవరోధంగా మారింది.  యాక్సిస్‌ బ్యాంక్‌లో ప్రభుత్వం 9.6శాతం వాటా కలిగి ఉంది. ఈ మొత్తం వాటాను మూడేళ్ల పాటు వివిధ విడతల్లో విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు ప్రదర్శన అంతంత మాత్రంగా ఉండటం కూడా  వాటా విక్రయ వాయిదాకు కారణమవుతోంది. 2016 నుంచి ప్రైవేట్‌ బ్యాంకులు మంచి ర్యాలీ చేస్తున్నప్పటికి యాక్సిస్‌ బ్యాంకు మాత్రం అంతంతగానే రాణిస్తోంది. 2016లో ప్రైవేట్‌ బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 60శాతం ర్యాలీ చేయగా, యాక్సిక్‌ బ్యాంకు షేరు మాత్రం కేవలం 25శాతం మాత్రమే లాభపడింది. 



You may be interested

డిష్‌మాన్ కార్బోజెన్ అమ్‌సిస్ కొనచ్చు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

Saturday 6th October 2018

ముంబై:- ప్రముఖ రేటింగ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఔషద ఉత్పత్తుల కంపెనీ డిష్‌మాన్ కార్బోజెన్ అమ్‌సిస్ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది.  గతేడాదిలో డిష్‌మ్యాన్ ఫార్మా సంస్థ డిష్‌మాన్ కార్బోజెన్ అమ్‌సిస్ పేరుతో రీ లిస్టింగ్ అయింది. గత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఫలితాలను సాధించడంతో పాటు, రానున్న రోజుల్లో తన వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకోవడానికి కంపెనీ రూపొందించుకున్న చక్కటి ప్రణాళికలు షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడానికి కారణమైనట్లు హెచ్‌డీఎఫ్‌సీ

ఆర్తి డ్రగ్స్‌: 65% అప్‌సైడ్‌కు ఛాన్స్‌..

Saturday 6th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా ఆర్తి డ్రగ్స్‌పై బుల్లిష్‌గా ఉంది. ఎందుకో చూద్దాం..  స్టాక్‌: ఆర్తి డ్రగ్స్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.546 టార్గెట్‌ ప్రైస్‌: రూ.910 అప్‌సైడ్‌: 66 శాతం సెంట్రమ్‌.. ఆర్తి డ్రగ్స్‌పై పాజిటివ్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.910గా నిర్ణయించింది. ఆర్తి డ్రగ్స్‌ కంపెనీ తయారు చేసే 10 ఏపీఐలలో (యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రీడియెంట్‌) తొమ్మిదింటిలో మార్కెట్‌ లీడర్‌గా ఉందని పేర్కొంది. క్వాలిఫైడ్‌

Most from this category