STOCKS

News


భారత్‌కు చైనా పెట్టుబడులు ఖాయం

Thursday 16th May 2019
news_main1557993484.png-25775

  • వాణిజ్య యుద్ధాల ప్రభావంపై ఆనంద్ మహీంద్రా ట్వీట్‌

న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో చైనా పెట్టుబడులు భారత్‌ వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సమావేశమవుతారన్న వార్తల నేపథ్యంలో మహీం‍ద్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. "ఒకవేళ వివాదాస్పద అంశాలు పరిష్కారమైనప్పటికీ .. అమెరికాకు భారీగా ఎగుమతులు చేసే చైనా సంస్థలు .. కొంత హెడ్జింగ్‌ కోసం భారత్‌లోనూ అనుబంధ సంస్థలపై పెట్టుబడులు పెట్టడం, తయారీ పరిజ్ఞానాన్ని బదలాయించడం వివేకవంతమైన నిర్ణయం అవుతుంది. ఈ రకంగా భారత్‌లోకి చైనా పెట్టుబడులు వెల్లువెత్తడం ఖాయం" అని మైక్రో బ్లాగింగ్ సైటు ట్విటర్‌లో ఆనంద్ మహీం‍ద్రా వ్యాఖ్యానించారు. చాలా భారతీయ కంపెనీలు దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. చైనా పెట్టుబడులతో దేశీ ప్రజల ప్రయోజనాలకేమైనా విఘాతం కలిగే అవకాశం ఉంటుందా అన్న ఓ ఫాలోవర్ ప్రశ్నకు స్పందిస్తూ.. వీటి వల్ల భారత్‌కు ప్రస్తుతం అవసరమైన ఉద్యోగాల కల్పన జరుగుతుందని బదులిచ్చారు.



You may be interested

కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ లాభం రూ.60 కోట్లు

Thursday 16th May 2019

ఒక్కో షేర్‌కు 60 పైసలు డివిడెండ్‌ న్యూఢిల్లీ: కరూర్‌  వైశ్యా బ్యాంక్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో 19 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.51 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.60 కోట్లకు పెరిగిందని కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,700 కోట్ల నుంచి రూ.1,746 కోట్లకు పెరిగింది. రిటైల్‌ బ్యాంకింగ్‌

చలో విదేశీ... చాలా ఈజీ!!

Thursday 16th May 2019

అంతర్జాతీయ సంస్థల రాకతో మారిన చిత్రం చిన్న సంస్థలూ విదేశాల్లో విక్రయించొచ్చు  తేలిగ్గా ఉత్పత్తులను చేరవేసే అవకాశం  వాల్‌మార్ట్‌, అమెజాన్‌ ప్రత్యేక కార్యక్రమాలు న్యూఢిల్లీ: ముంబైకి చెందిన ఇండోకౌంట్‌ ఇండస్ట్రీస్‌ మొదట్లో చాలా చిన్న కంపెనీ. కానీ పదేళ్ల కిందట వాల్‌మార్ట్‌ హోమ్‌ బ్రాండ్‌ కెనోపీతో ఒప్పందం కుదుర్చుకోవటం ఈ సంస్థకు అనూహ్యంగా కలిసి వచ్చింది. బెడ్‌షీట్లు, ఫ్యాషన్‌ బెడ్డింగ్‌ ఉత్పత్తులు విక్రయించే ఈ సంస్థ... దేశీ స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కావటమే కాక... ప్రస్తుతం

Most from this category