STOCKS

News


చందాకొచ్చర్‌ నుంచి రూ.9కోట్లు వెనక్కి

Friday 1st February 2019
news_main1549005942.png-23936

  • బోనస్‌ ప్రయోజనాలను వెనక్కి తీసుకోనున్న బ్యాంకు

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందాకొచర్‌ సుమారు రూ.9 కోట్లకు పైగా ఆర్థిక ప్రయోజనాలను కోల్పోనున్నారు. వీడియోకాన్‌ గ్రూపునకు రుణాల జారీలో కొచర్‌ బ్యాంకు నిబంధనలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీకృష్ట కమిటీ నిర్ధారించిన నేపథ్యంలో, కొచర్‌ను తొలగించినట్టు పరిగణిస్తామని, ఆమెకు గతంలో ఇచ్చిన పనితీరు ఆధారిత బోనస్‌లు, పెండింగ్‌లో ఉన్నవి, ఇంక్రిమెంట్లు ఇతర ప్రయోజనాలను సైతం రద్దు చేస్తామని బ్యాంకు బుధవారమే ప్రకటించింది. బోనస్‌లతోపాటు అన్‌ఎక్సర్‌సైజ్డ్‌ స్టాక్‌ ఆప్షన్లను కూడా వదులుకోవాల్సి ఉంటుందని బ్యాంకు వర్గాలు తెలిపాయి. 2009 మే నెలలో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా నియమితులైన కొచర్‌, తనపై ఆరోపణల కారణంగా గతేడాది అక్టోబర్‌లో పదవికి రాజీనామా చేశారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కొచర్‌కు ఇవ్వదలిచిన పనితీరు ఆధారిత బోనస్‌లకు ఆర్‌బీఐ ఇంకా ఆమోదం తెలియజేయలేదని, దీంతో ఈ బోనస్‌లను కొచర్‌కు ఇచ్చినట్టు పరిగణించబోమని బ్యాంకు వర్గాలు స్పష్టం చేశాయి. పలు వార్షిక నివేదికల ఆధారంగా చూస్తే చందాకొచర్‌కు 94 లక్షల షేర్లను బ్యాంకు మంజూరు చేసింది. స్టాక్‌ ఆప్షన్లలో ఎన్ని ఆమె వినియోగించుకున్నారనే సమాచారం లేదు. చందాకొచర్‌కు ఇచ్చిన ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్‌ ప్లాన్‌ (ఈసాప్‌)ను కూడా పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం చందాకొచర్‌కు ముట్టిన ఆర్థిక ప్రయోజనాలు రూ.340 కోట్ల మేర ఉంటాయని బ్యాంకు వర్గాల సమాచారం. ఇక, 2009 నుంచి ఆమె బ్యాంకును వీడే రోజు వరకు చెల్లించిన బోనస్‌లను కూడా తిరిగి వసూలు చేసేందుకు చర్యలు చేపట్టాలని బ్యాంకు బోర్డు కోరిన విషయం గమనార్హం. తొమ్మిదేళ్ల కాలంలో వాటాదారుల ఆమోదంతో బ్యాంకు కొచర్‌కు చెల్లించిన బోనస్‌ల విలువ రూ.9.82 కోట్లుగా ఉంది. ఇందులో గత రెండేళ్ల బోనస్‌లు ఇంకా చెల్లించనందున ఆమె నుంచి రాబట్టాల్సిన మొత్తం తక్కువే ఉంటుందని బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. కాగా, చందాకొచర్‌కు ఇచ్చిన ప్రయోజనాలను ఉపసంహరించుకునే విషయంలో న్యాయపరమైన చిక్కులను బ్యాంకు ఎదుర్కోవాల్సి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకు నిర్ణయాలు తనను బాధించాయని, షాక్‌కు గురిచేశాయని కొచర్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.You may be interested

ఎయిర్‌టెల్‌ లాభం 72శాతం డౌన్‌

Friday 1st February 2019

ఈ క్యూ3లో నికర లాభం రూ.86 కోట్లు -1 శాతం వృద్ధితో రూ.20,519 కోట్లకు మొత్తం ఆదాయం -భారత్‌లో తగ్గిన వినియోగదారులు, పెరిగిన డేటా న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి 72 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.306 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.86 కోట్లుగా నమోదైందని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. భారత్‌లో టెలికం వ్యాపారంలో

మళ్లీ పసిడి ‘‘డ్రీమ్‌ రన్‌’’

Friday 1st February 2019

- వాణిజ్య యుద్ధ భయాలు - అమెరికా ఫెడ్‌ ఫండ్‌ రేటు ఇక పెరక్కపోవచ్చని విశ్లేషణ - డాలర్‌ ఇండెక్స్‌ బలహీన ధోరణి - వెరసి అంతర్జాతీయంగా తిరిగి 1,300 డాలర్ల స్థాయిపైకి బంగారం - దేశీయంగా పుత్తడికి బలాన్నిస్తున్న రూపాయి పతన ధోరణి - పసిడి ధర పైకేనన్న అంచనాలు అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా పసిడి ధర మళ్లీ పరుగుపెడుతోంది. ఈ వార్త రాసే సమయానికి (రాత్రి 8 గంటలు) అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌ న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్చేంజ్‌లో పసిడి

Most from this category