News


ఈడీ విచారణకు చందా గైర్హాజరు

Tuesday 11th June 2019
news_main1560228392.png-26219

న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలిచ్చిన వ్యవహారంలో ముడుపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరు కాలేదు. అనారోగ్యం రీత్యా హాజరు కాలేకపోతున్నానని ఆమె అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. గత వారం కూడా ఇదే కారణంతో ఆమె విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో వచ్చే వారం విచారణకు హాజరవ్వాల్సిందేనని ఆదేశించనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈడీ గత నెల చందా కొచర్‌, ఆమె భర్త దీపక్‌ కొచర్‌లను ప్రశ్నించి, వారి నుంచి స్టేట్‌మెంట్స్ తీసుకుంది. అవసరమైతే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అటాచ్ చేసేందుకు వీలుగా వారి ఆస్తుల వివరాలన్నింటినీ మదింపు చేస్తోంది. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1,875 కోట్ల రుణాలివ్వడంలో చందా కొచర్ పాత్ర ఉందని అభియోగాలున్నాయి. వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్.. ఈ రుణాలకు ప్రతిగా చందా కొచర్‌ భర్త దీపక్ కొచర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ సంస్థలో కొంత పెట్టుబడులు పెట్టారు. ఈ క్విడ్ ప్రో కో లావాదేవీ ద్వారా కొచర్‌ కుటుంబం లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. తర్వాత రోజుల్లో ఈ రుణాలు మొండిబాకీలుగా మారడం గమనార్హం.



You may be interested

నాలుగో నెల్లోనూ మారుతీ కోత

Tuesday 11th June 2019

18 శాతం తగ్గిన వాహన తయారీ  డిమాండ్‌ మందగమనమే కారణం న్యూఢిల్లీ: వాహన దిగ్గజం, మారుతీ సుజుకీ ఇండియా గత నెలలో వాహన ఉత్పత్తిని 18 శాతం తగ్గించింది. ఈ కంపెనీ వాహనాల ఉత్పత్తిలో కోత విధించడం ఇదివరుసగా నాలుగో నెల. మారుతీ సుజుకీ ఇండియా ఈ మేరకు స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు నివేదించింది. వివరాలివీ... - గత ఏడాది మేలో ఈ కంపెనీ 1,84,612 వాహనాలను తయారు చేసింది. - ఈ ఏడాది మే నెలలో

ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ చేతికి జేపోర్‌ బ్రాండ్‌

Tuesday 11th June 2019

డీల్‌ విలువ రూ.110 కోట్లు   ముంబై: ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ (ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌) కంపెనీ ఎథ్నిక్‌ వేర్ బ్రాండ్స్‌- జేపోర్‌, టీజీ అప్పారెల్‌ అండ్‌ డెకార్‌లను కొనుగోలు చేస్తోంది. జేపోర్‌ బ్రాండ్‌ను రూ.110 కోట్లకు, టీజీ అప్పారెల్‌ అండ్‌ డెకార్‌ బ్రాండ్‌ను  రూ.25 కోట్లకు కొనుగోలు చేయనున్నామని ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ తెలిపింది. ఈ డీల్‌ 30- 45 రోజుల్లో పూర్తవ్వగలదని  పేర్కొంది. ఎథ్నిక్‌  అప్పారెల్‌,

Most from this category