STOCKS

News


ఎ౾యిరిండియా విక్రయంపై కేంద్రం కసరత్తు..

Wednesday 28th November 2018
news_main1543391292.png-22446

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయానికి కేంద్రం మళ్లీ కసరత్తు జరుపుతోంది. రుణభారం పేరుకుపోయిన సంస్థను ప్రస్తుత రూపంలో కొనుగోలు చేయటానికి ఎవరూ ముందుకు రాకపోతుండటంతో... కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఎయిరిండియా రుణభారంలో 'సింహభాగం' వాటాను, ఆ సంస్థ గ్రౌండ్‌ హ్యాండ్లింగ్ యూనిట్‌ను ప్రత్యేకంగా మరో సంస్థ కింద విడగొట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే స్పెషల్ పర్పస్ వెహికల్‌ను (ఎస్‌పీవీ) ఏర్పాటు చేసింది. ఎయిరిండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్‌లో (ఏఐఏటీఎస్‌ఎల్‌) కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 100 శాతం వాటాలను ఈ ఎస్‌పీవీకి బదలాయిస్తున్నట్లు ఏవియేషన్ శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్‌ చౌబే తెలిపారు. ఈ వాటాలను విక్రయించడం ద్వారా వచ్చే నిధులను ఎయిరిండియా రుణాల చెల్లింపునకు వాడతామని ఆయన చెప్పారు. అయితే, ఎయిరిండియా రుణంలో ఎంత భాగాన్ని కొత్త సంస్థకు బదలాయించినదీ వెల్లడించడానికి చౌబే నిరాకరించారు. ఎయిరిండియా విక్రయంపై ఏర్పాటైన ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) భేటీలో ఎస్‌పీవీ మీద నిర్ణయం తీసుకున్నారు. గ్రౌండ్‌ హ్యాండ్లింగ్ యూనిట్‌ విక్రయానికి కూడా బిడ్లను ఆహ్వానించాలని ఏఎం నిర్ణయం తీసుకుంది. ఈసారి మాత్రం విక్రయ ప్రతిపాదన సజావుగా అమలు కాగలదని, అయితే ఇందుకు ఎంత సమయం పట్టేది మాత్రం చెప్పలేమని చౌబే తెలిపారు.



You may be interested

ఆయుష్మాన్‌ భారత్‌తో మూడు లక్షల మందికి ప్రయోజనం

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య స్కీమ్‌ కారణంగా నెలన్నర కాలంలో మూడు లక్షల మంది పేదలు ప్రయోజనం పొందారని ఆర్థిక మంత్రి ఆరుణ్‌ జైట్లీ చెప్పారు. వీరిలో సగం మంది హాస్పిటలైజేషన్‌ ప్రయోజనాలు పొందారని వివరించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం వ్యాపారానికి, పేదలకు అనుకూలంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు కావలసిన నిధులకు అపారమైన వనరులు అవసరమని వివరించారు. మేకింగ్‌ ఆఫ్‌ న్యూ ఇండియా, ట్రాన్స్‌ఫార్మేషన్‌ అండర్‌ మోదీ గవర్నమెంట్‌

నిరంతర చర్చలతో ఆర్థిక వ్యవస్థకు ఊతం!

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిరంతర చర్చలు కొనసాగించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఆర్‌బీఐపై నియంత్రణసహా కీలక అంశాలకు సంబంధించి ఇటీవల కేంద్రం, ఆర్‌బీఐ మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి తాజా సూచన చేయడం గమనార్హం. భారత జౌళి పరిశ్రమ సమాఖ్య (సీఐటీఐ) వజ్రోత్సవాలను (60 సంవత్సరాలు) పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు చేసిన ప్రసంగంలో

Most from this category