STOCKS

News


ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ రోడ్‌మ్యాప్‌నకు కమిటీలు

Tuesday 7th August 2018
news_main1533619907.png-19005

న్యూఢిల్లీ: ఎయిర్‌క్రాఫ్ట్‌లు, డ్రోన్ల తయారీకి కార్యాచరణను రూపొందించేందుకు ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేసినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్‌ ప్రభు తెలిపారు. ఏవియేషన్‌ రంగం దేశీయంగా వేగంగా వృద్ధి చెందుతోందని, ప్రతీ రోజూ కొత్తగా ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. దీంతో రానున్న సంవత్సరాల్లో వేలాది విమానాల కొనుగోళ్లకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. విమానయాన రంగాన్ని ప్రోత్సహించేందుకు గాను రెండు టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఒకటి విమానాల తయారీ అవకాశాలను అధ్యయనం చేసేందుకు, మరొకటి డ్రోన్ల తయారీని అధ్యయనం చేసేందుకని మంత్రి పార్లమెంటుకు తెలిపారు. 



You may be interested

‘పెప్సీ’లో ముగియనున్న ఇంద్రానూయి శకం

Tuesday 7th August 2018

న్యూయార్క్‌: భారతీయ మహిళలు వ్యాపార నిర్వహణలోనూ దిట్టలు అని నిరూపించిన మహిళ... ప్రపంచ స్థాయి కంపెనీని సైతం విజయవంతంగా భవిష్యత్తులోకి నడిపించగలరని నిరూపించిన నారీశక్తి... ప్రపంచ పారిశ్రామిక రంగంలో అసాధారణ మహిళగా గుర్తింపు పొందిన ఇంద్రా నూయి (62) పెప్సీకో కంపెనీ నాయకత్వ బాధ్యతల్ని విడిచిపెట్టబోతున్నారు. శీతలపానీయాలు, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ తయారీలో ప్రపంచ రెండో అగ్రగామి సంస్థ, అమెరికాకు చెందిన ‘పెప్సీకో’ సీఈవోగా పనిచేస్తున్న భారతీయ అమెరికన్‌ ఇంద్రానూయి త్వరలో

భూషణ్‌ స్టీల్‌ బిడ్డింగ్‌ గడువుతేదీ పెంపు

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ను సొంతం చేసుకునేందుకు పోటీపడుతున్న మూడు దిగ్గజ కంపెనీలకు మరింత సమయం లభించింది. టాటా స్టీల్‌ అభ్యర్ధన మేరకు సవరించిన (రివైజ్డ్‌) బిడ్‌ను దాఖలు చేసేందుకు గడువుతేదీని ఈనెల 13 వరకు పొడిగించినట్లు నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) తెలిపింది. భూషణ్‌ స్టీల్‌ను దక్కించుకునేందుకు టాటా స్టీల్‌, లిబర్టీ హౌస్‌, జీఎస్‌డబ్ల్యూ స్టీల్‌ సంస్థలు రేసులో ఉన్నాయి.

Most from this category