STOCKS

News


ఆర్‌ఈసీ చేతికి పీఎఫ్‌సీనా? పీఎఫ్‌సీ చేతికి ఆర్‌ఈసీనా?

Wednesday 5th December 2018
news_main1543990459.png-22656

కేంద్ర ప్రభుత్వం తొలిగా ఆర్‌ఈసీ చేత పీఎఫ్‌సీని కొనుగోలు చేయించాలని భావించింది. అయితే ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) చేత రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ)ను కొనుగోలు చేయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీని వల్ల కేంద్రానికి రూ.14,000 కోట్లు లభించొచ్చని ప్రముఖ ఆంగ్ల పత్రిక తెలియజేసింది. కాగా ఈ కొనుగోలు ప్రతిపాదినకు క్యాబినెట్‌ ఆమోదం లభించాల్సి ఉంది. డిసెంబర్‌ 5 ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ తాజా డీల్‌ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) చేత హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌)ను కొనుగోలు చేయించిన డీల్‌ను పోలి ఉండటం గమనార్హం. 
కేంద్ర ప్రభుత్వపు ద్రవ్య లోటు లక్ష్యం.. అక్టోబర్‌ చివరి నాటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనాలు (రూ.6.24 లక్షల కోట్లు లేదా జీడీపీలో 3.3 శాతం) దాటేసిన నేపథ్యంలో పీఎఫ్‌సీ-ఆర్‌ఈసీ డీల్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. పన్ను వసూళ్లు తగ్గడం, డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం వంటి అంశాలు ద్రవ్య లోటు కట్టుతప్పడానికి ప్రధాన కారణాలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి దాకా కేం‍ద్ర ప్రభుత్వం తన రూ.80,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యంలో రూ.32,247 కోట్లనే సమీకరించగలిగింది. 
కేంద్రం తొలిగా ఆర్‌ఈసీ చేత పీఎఫ్‌సీని కొనిపించాలని భావించింది. పీఎఫ్‌సీలో కేంద్రానికి ఎక్కువ వాటా ఉంది. సంస్థ మార్కెట్‌ వ్యాల్యు కూడా ఎక్కువే. దీని వల్ల అధిక మొత్తాన్ని పొందొచ్చని భావించింది. అయితే వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్న తర్వాత కేంద్రం ఇప్పుడు పీఎఫ్‌సీ చేత ఆర్‌ఈసీని కొనుగోలు చేయించాలని చూస్తోంది. ‘విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఇరు సంస్థల విలీనంపై ఆందోళన వ్యక్తం చేసింది. తప్పని పరిస్థితుల్లో విలీనం చేయాల్సి వస్తే పీఎఫ్‌సీ చేత ఆర్‌ఈసీని కొనుగోలు చేయించడం మంచిది’ అని ప్రభుత్వ అధికారి ఒకరు ఆంగ్ల పత్రికకు తెలియజేశారు. విద్యుత్‌ మంత్రిత్వ శాఖ గతంలో కూడా ఇరు సంస్థల విలీనం వల్ల నిర్వహణ, పాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమౌతాయని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం విద్యుత్‌ రంగంలోని రెండు ప్రభుత్వ కంపెనీలు పోటీ పడటం కన్నా రెండింటిని కలిపి దిగ్గజ ఆర్థిక సంస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కాగా కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఆర్‌ఈసీలో 58 శాతం, పీఎఫ్‌సీలో 66 శాతం వాటాలున్నాయి. డీల్‌ ఓకే అయితే అప్పుడు కొనుగోలు చేసే సంస్థ మార్కెట్‌ వ్యాల్యు తగ్గిపోతుందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే రెండు నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీల విలీనానికి ఆర్‌బీఐ అనుమతి అవసరమని తెలిపాయి. You may be interested

మార్కెట్లను కుదిపేసిన ‘సెల్‌ ద ర్యాలీ’ వ్యూహం

Wednesday 5th December 2018

అమెరికా, చైనాల మధ్య సంధి కుదిరిన 24 గంటల్లోగానే మార్కెట్‌ ర్యాలీ ఆవిరి అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్‌లో జరిగిన జీ–20 సదస్సు సందర్భంగా అమెరికా, చైనాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం తొలుత మార్కెట్ల ర్యాలీకి సహకరించినప్పటికీ.. ఇప్పుడు అదే ఒప్పందం సూచీలు కుప్పకూలేలా చేసింది. కనీసం 24 గంటలు కూడా గడవక ముందే ర్యాలీ చల్లబడిపోయింది. అదనపు సుంకాల విధింపులను 90 రోజుల పాటు నిలిపివేయాలని ఇరు దేశాల

డాలర్‌ రీకవరీ: నష్టాల్లో పసిడి

Wednesday 5th December 2018

ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ తిరిగి పుంజుకోవడంతో పాటు ట్రేడర్లు పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణకు పూనుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం పసిడి ధర తగ్గుముఖం పట్టింది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 6.20డాలర్ల నష్టపోయి 1,240.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతరాత్రి అమెరికా మార్కెట్లో పదేళ్ల ఈల్డ్‌, ఈక్విటీ షేర్ల పతనం కారణంగా అక్కడి మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 1,247.40 డాలర్ల

Most from this category