News


సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నష్టాలు రూ.2,477 కోట్లు

Thursday 16th May 2019
news_main1557994057.png-25777

  • పెరిగిన ఎన్‌పీఏ కేటాయింపులు


న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నష్టాలు గత ఆర్థిక సంవత్సరం (2018-19) జనవరి-మార్చి క్వార్టర్‌లో మరింతగా పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ,.2,114 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,477 కోట్లకు పెరిగాయి. కాగా గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో మాత్రం ఈ బ్యాంక్‌కు రూ.718 కోట్ల నికర నష్టాలు మాత్రమే వచ్చాయి. మొండి బకాయిలకు అధికంగా కేటాయింపులు జరపడం వల్ల క్యూ4లో నికర నష్టాలు భారీగా పెరిగాయని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలియజేసింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.6,301 కోట్ల నుంచి రూ.6,621 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 
తగ్గిన మొండి బకాయిలు 
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.5,105 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,641 కోట్లకు పెరిగాయి. ఆదాయం రూ.26,658 కోట్ల నుంచి రూ.25,052 కోట్లకు తగ్గింది. గత ఏడాది మార్చి నాటికి 21.48 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 19.29 శాతానికి తగ్గాయి. అలాగే నికర మొండి బకాయిలు 11.10 శాతం నుంచి 7.73 శాతానికి తగ్గాయి. కేటాయింపులు రూ.4,832 కోట్ల నుంచి రూ.4,524 కోట్లకు తగ్గాయని వివరించింది. ఉద్యోగులకు షేర్ల కేటాయింపుల(ఎసాప్స్‌) ద్వారా రూ.213 కోట్లు సమీకరించామని తెలిపింది. 



You may be interested

అమ్మకాల మూడ్‌లో ఎఫ్‌పీఐలు!

Thursday 16th May 2019

పెరుగుతున్న షార్ట్‌ పొజిషన్లు విదేశీ సంస్థాగత మదుపరులు ఇండియా ఈక్విటీల్లో విక్రయాల మూడ్‌లోకి మారారు. యూఎస్‌, చైనా ట్రేడ్‌వార్‌, ఎన్నికల ఫలితాలపై నెగిటివ్‌ వార్తలతో విదేశీ మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణకు దిగారు. కేవలం ఒక్క బుధవారమే ఎఫ్‌ఐఐలు రూ. 1142 కోట్ల షేర్లను విక్రయించారు. మేసీరిస్‌లో ఎఫ్‌ఐఐలు రూ. 3100 కోట్ల నికర విక్రయాలు జరిపారు. మేలో జరిగిన పది ట్రేడింగ్‌ సెషన్లలో ఏడు సెషన్లు ఎఫ్‌ఐఐలు నికర విక్రయాలకు మొగ్గు

కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ లాభం రూ.60 కోట్లు

Thursday 16th May 2019

ఒక్కో షేర్‌కు 60 పైసలు డివిడెండ్‌ న్యూఢిల్లీ: కరూర్‌  వైశ్యా బ్యాంక్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో 19 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.51 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.60 కోట్లకు పెరిగిందని కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,700 కోట్ల నుంచి రూ.1,746 కోట్లకు పెరిగింది. రిటైల్‌ బ్యాంకింగ్‌

Most from this category