STOCKS

News


మార్కెట్లోకి రెక్కలు లేని సీలింగ్‌ ఫ్యాన్లు

Wednesday 24th April 2019
news_main1556080638.png-25313

హైదరాబాద్‌: సాధార‌ణ సీలింగ్ ఫ్యాన్లకు భిన్నంగా రెక్కలు లేని అధునాతన ఫ్యాన్లు తెలుగురాష్ట్రాల్లోకి అడుగుపెట్టాయి. ఎక్స్ హీల్  కంపెనీ రూపొందించిన ఈ నూతనతరం ఉత్పత్తులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో డొమెక్ సొల్యూషన్స్ పరిచయంచేసింది. శుద్దిచేసిన గాలిని ఏమాత్రం శబ్ధంలేకుండా 360 డీగ్రీల్లో అందిచడమే కాకుండా, ఏసీని ఆపినప్పటికీ ఉష్ణోగ్రతను ఈ ఫ్యాన్లు 8 గంట‌ల వ‌ర‌కు నిర్వహించగలవని వివరించింది. ఎల్‌ఈడీ లైట్లు లేని ఫ్యాను ధర రూ.23,500 కాగా, ఎల్‌ఈడీ కలిగిన ఫ్యాను ధర రూ.25,600 ఉన్నట్లు అధికారిక పంపిణీదారైన డొమెక్ ఎండీ ర‌ఘురామిరెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రాంచైజీలు ఏర్పాటుచేయనున్నామని, హైద‌రాబాద్‌లో నాలుగు ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్లు ప్రారంభించనున్నామని తెలిపారు. 



You may be interested

రెడ్‌బస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ధోనీ

Wednesday 24th April 2019

న్యూఢిల్లీ: బస్‌ టికెటింగ్‌ సేవల సంస్థ రెడ్‌బస్‌ ప్రముఖ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్టు ప్రకటించింది. తమ బ్రాండ్‌ తరఫున అన్ని రకాల వినియోగదారుల ప్రచార కార్యక్రమాల్లో ఇక ధోనీ దర్శనమిస్తారని తెలిపింది. త్వరలోనే మొదటి ప్రచార కాన్సెప్ట్‌ను ప్రచారంలోకి తీసుకుకొస్తామని ప్రకటించింది. 

పీర్‌లెస్‌ నుంచి రూ.1,514 కోట్లు వసూళ్లు!

Wednesday 24th April 2019

- ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక‌్షన్‌ ఫండ్‌కు బదలాయింపులు - ఇన్వెస్టర్ల ప్రయోజనాల  పరిరక్షణలో కీలక పరిణామం న్యూఢిల్లీ: పీర్‌లెస్‌ జనరల్ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ ఇన్వెస్టర్లకు బకాయిపడిన రూ.1,514 కోట్లు రాబట్టుకోవడంలో ఎట్టకేలకు ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటక‌్షన్‌ ఫండ్‌ (ఐఈపీఎఫ్‌) సఫలీకృతమైంది. కోల్‌కతాకు చెందిన ఈ కంపెనీ ఎట్టకేలకు తన వద్ద 15 సంవత్సరాలకుపైగా పెండింగ్‌లో ఉండిపోయిన ‘అన్‌ పెయిడ్‌ డిపాజిట్లను (చెల్లించని డిపాజిట్లు) ఐఈపీఎఫ్‌కు బదలాయించినట్లు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ

Most from this category