STOCKS

News


ఆర్సెలర్‌ మిట్టల్‌ చేతికి ఎస్సార్‌ స్టీల్‌ !

Friday 21st September 2018
news_main1537504545.png-20432

న్యూఢిల్లీ: రుణ భారంతో కుదేలైన ఎస్సార్‌ స్టీల్‌ టోకోవర్‌కు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదం తెలిపింది.  ఆర్సెలర్‌ మిట్టల్‌, జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్‌ అండ్‌ సుమిటొమో మెటల్‌ కార్పొరేషన్‌ల కన్సార్షియమ్‌ ఎస్సార్‌ స్టీల్‌ కంపెనీని  టోకోవర్‌ చేయనున్నది. ఎస్సార్‌ స్టీల్‌ కంపెనీ 30కు పైగా బ్యాంక్‌లకు రూ.45,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ నడుస్తోంది. ఎస్సార్‌ స్టీల్‌ను చేజిక్కించుకోవడానికి రష్యాకు చెందిన వీటీబీ గ్రూప్‌కు చెందిన న్యూమెటల్‌ కంపెనీ కూడా పోటీ పడింది. న్యూమెటల్‌ కంఎనీ రూ.37,000 కోట్లు ఆఫర్‌ చేయగా, ఆర్సెలర్‌ మిట్టల్‌ కన్సార్షియమ్‌ రూ.42,000 కోట్లు ఆఫర్‌ చేసింది. మరోవైపు భూషణ్‌ స్టీల్‌ను కొనుగోలు చేయడానికి జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు కూడా సీసీఐ ఆమోదం తెలిపింది. 


 



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 21st September 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు యస్‌ బ్యాంక్‌:- యస్‌బ్యాంక్‌ సారధ్య బాధ్యతల నుంచి రాణా కపూర్‌ వచ్చే ఏడాది జనవరి కల్లా వైదొలగాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ నేపధ్యంలో తదుపరి చర్యలపై చర్చించేందుకు బ్యాంకు బోర్డు డైరెక్టర్లు ఈ సెప్టెంబర్‌ 25న సమావేశం కానున్నారు. విప్రో టెక్‌:- యూరప్‌లో తన అనుబంధ సంస్థ విప్రో టెక్‌ ఆస్ట్రియాను విలీనం చేసుకునేందకు షేర్‌హోల్డర్లు అనుమతినిచ్చారు. టాటా మోటర్స్‌:- ఫిచ్‌ రేటింగ్‌

రూపాయిపై మరికొంత కాలం ఒత్తిడి తప్పదు..!

Friday 21st September 2018

న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి ప్రతికూల స్థూల ఆర్థిక అంశాల నేపథ్యంలో రూపాయి మారకం విలువపై ఇంకొంతకాలం ఒత్తిడి కొనసాగేందుకే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ తన నివేదికలో వెల్లడించింది. పెరిగిన ముడి చమురు ధరలు, బలపడుతున్న అమెరికా డాలర్‌ విలువ, ఆర్థిక వ్యవస్థపై తాజా అంచనాలతో పాటు అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలపై

Most from this category