STOCKS

News


పీఎస్‌బీలకు తగ్గనున్న మూలధన భారం

Wednesday 21st November 2018
news_main1542776428.png-22254

ముంబై: మూలధన పరిరక్షణ కోసం ఉద్దేశించిన నిల్వలను (సీసీబీ) తగిన స్థాయిలో సమకూర్చుకునేందుకు మరింత గడువు లభించడంతో ప్రభుత్వ రంగ బ్యాంకులపై (పీఎస్‌బీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.35,000 కోట్ల మేర భారం తగ్గుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌బీల మూలధన అవసరాల అంచనాలు రూ.1.2 లక్షల కోట్ల నుంచి రూ. 85,000 కోట్లకు తగ్గుతాయని వివరించింది. అయితే, బ్యాంకుల పనితీరు ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో కేంద్రమే ఈ నిధులను సమకూర్చాల్సి రావొచ్చని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. 
సీసీబీ విధానాన్ని 2008లో ప్రవేశపెట్టారు. దీని కింద అత్యవసర పరిస్థితుల్లో అక్కరకు వచ్చేలా సాధారణ సమయాల్లో బ్యాంకులు కొంత క్యాపిటల్ బఫర్‌ను సిద్ధం చేసుకుంటూ ఉండాలి. నిబంధనల ప్రకారం సెప్టెంబర్‌ 30 నాటికి బ్యాంకులు 8.875 శాతం క్యాపిటల్ అడెక్వసీ రేషియో (సీఏఆర్‌)ను పాటించాల్సి ఉంది. ఇందులో 7 శాతం టియర్ 1 సీఏఆర్‌ కాగా, సీసీబీ వాటా 1.875 శాతం. సీసీబీని వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 0.625 శాతం మేర పెంచుకోవాల్సి ఉంది. అయితే, సోమవారం జరిగిన సమావేశంలో ఇందుకు సంబంధించిన గడువును 2020 మార్చి దాకా పొడిగిస్తూ రిజర్వ్ బ్యాంక్ బోర్డు నిర్ణయం తీసుకుంది.



You may be interested

స్టార్టప్స్‌ వేల్యుయేషన్స్‌పై కేంద్రం దృష్టి

Wednesday 21st November 2018

న్యూఢిల్లీ: కుప్పతెప్పలుగా పుట్టుకొచ్చిన స్టార్టప్ సంస్థలు భారీ వేల్యుయేషన్స్ దక్కించుకుంటూ ఉండటంపై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ దృష్టి సారించింది. ఈ స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు భారీ ప్రీమియంతో షేర్లు తీసుకోవడం వెనుక అసలు కారణాలను తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. తొలి విడత నిధుల సమీకరణ తర్వాత వేల్యుయేషన్స్‌ గణనీయంగా పడిపోయిన కంపెనీలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 2013 నుంచి నిధులు సమీకరించిన 2,000 పైచిలుకు

గల్ఫ్‌ ఆయిల్‌ నుంచి రెండు కొత్త బ్యాటరీలు

Wednesday 21st November 2018

అహ్మదాబాద్‌: లూబ్రికెంట్ల తయారీ సంస్థ గల్ఫ్‌ ఆయిల్‌... రెండు కొత్త టూ-వీలర్‌ బ్యాటరీలను మార్కెట్లోకి తెచ్చింది. బ్యాటరీల వ్యాపారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితుడైన క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా సమక్షంలో ఈ గల్ఫ్‌ ప్రైడ్‌ బ్యాటరీలను కంపెనీ ఆవిష్కరించింది. టూ-వీలర్‌ బ్యాటరీ మార్కెట్లో తమ వాటాను క్రమంగా పెంచుకుంటున్నామని గల్ఫ్‌ ఆయిల్‌ ఎండీ రవి చావ్లా పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,000 కోట్ల రీప్లేస్‌మెంట్‌ మార్కెట్లో తమ వాటా 1.5

Most from this category