STOCKS

News


ఐసీఐసీఐ బ్యాంక్‌- వీడియోకాన్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు

Thursday 24th January 2019
news_main1548318009.png-23782

దాదాపు 3వేల కోట్ల రూపాయల ఐసీఐసీఐ బ్యాంక్‌- వీడియోకాన్‌ లోన్‌ కేసులో అవకతవకలకు సంబంధించి గురువారం సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను రిజిస్టర్‌ చేసింది. దీంతోపాటు పలు చోట్ల దాడులు నిర్వహించింది. ఈలోనుకు సంబంధించి ఐసీఐసీఐ మాజీ సీఈవో చందాకొచ్చర్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె తన పదవిని వదులుకున్నారు. చందాకొచ్చర్‌ భర్తకు సంబంధించిన నుపవర్‌ రెనీవబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు వీడియోకాన్‌ గ్రూప్‌ నుంచి అక్రమంగా నిధులు బదిలీ అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా ముంబయిలోని వీడియోకాన్‌ కార్యాలయాలపై, చందాకొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌కు చెందిన నుపవర్‌, సుప్రీం పవర్‌ కార్యాలయాలపై సీబీఐ దాడులు చేసింది. వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసీఐసీఐ నుంచి రుణం వచ్చాక ప్రతిఫలంగా వీడియోకాన్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ వేల కోట్లరూపాయలను నుపవర్‌లో పెట్టుబడిగా పెట్టారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసుపై గతసంవత్సరం సీబీఐ ప్రాథమిక విచారణ ఆరంభించింది. తాజాగా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడంతో కేసుపై పూర్తి విచారణ జరిపేందుకు సీబీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న విషయాలు ఇంకా బహిర్గతం కాలేదు.You may be interested

టీటీకే హెల్త్‌కేర్‌ 20శాతం జంప్‌

Thursday 24th January 2019

ప్రముఖ వైద్య సేవల కంపెనీ టీటీకే హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ గురువారం 20శాతం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.770.3ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తెలియని కారణాలతో ఇంట్రాడేలో షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఏకంగా 20శాతం ర్యాలీ చేసి రూ.924.00ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:00లకు షేరు గతముగింపు(రూ.770.3)తో పోలిస్తే దాదాపు 19శాతం లాభంతో రూ.921ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  బీఎస్‌ఈలో

ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌కు ఫలితాల ఊపు

Thursday 24th January 2019

నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌రంగ కంపెనీ ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేరు గురువారం ట్రేడింగ్‌లో 7శాతం క్షీణించింది. క్యూ3 ఫలితాల్లో సాధించిన మెరుగైన ఫలితాలకు తోడు గ్లోబల్‌ రీసెర్చ్‌ దిగ్గజం మెక్వ్యరీ షేరు టార్గెట్‌ ధరను పెంచడం షేరు ర్యాలీకి దోహదపడింది. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ వెల్లడించిన ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో నేడు బీఎస్‌ఈలో గత ముగింపు (రూ.284.4) ధరతో పోలిస్తే 2శాతం లాభంతో రూ.284.4ల వద్ద

Most from this category