STOCKS

News


నీషల్‌మోదీని రప్పించేందుకు సీబీఐ యత్నాలు

Tuesday 11th September 2018
news_main1536642977.png-20161

న్యూఢిల్లీ: నీరవ్‌మోదీ సోదరుడు నీషల్‌ మోదీని భారత్‌కు రప్పించే విషయంలో సీబీఐ తన ప్రయత్నాలు ఆరంభించినట్టు అధికార వర్గాలు తెలిపారు. ఇందుకు సంబంధించి సీబీఐ కేంద్ర హోంశాఖకు అభ్యర్థన పంపినట్టు పేర్కొన్నాయి. సీబీఐ వినతిని కేంద్ర హోంశాఖ బెల్జియంకు పంపనుంది. నీషల్‌ మోదీ బెల్జియంలోనే తలదాచుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. బెల్జియం పౌరసత్వం కలిగిన నీషల్‌మోదీపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్‌ నోటీసులు కూడా జారీ అయ్యాయి. బెల్జియంతో మన దేశానికి నిందితుల/నేరస్థుల అప్పగింత ఒప్పందం ఉంది. వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.13,000 కోట్లకుపైగా మోసం చేసిన విషయం తెలిసిందే. ఇందులో నీషల్‌మోదీకి కూడా లబ్ధి కలిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. నీషల్‌తోపాటు, ఆయన సోదరుడు నీరవ్‌మోదీ, వీరి సమీప బంధువు మెహుల్‌చోక్సీలు ఈ ఏడాది జనవరిలో దేశం విడిచి పరారైన విషయం విదితమే. 
 



You may be interested

పెమెంట్స్‌ సేవల విషయంలో నిబంధనలు పాటిస్తాం: గూగుల్‌

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: పేమెంట్‌ సేవలకు సంబంధించిన డేటాను స్థానికంగానే నిల్వ చేయాలన్న ఆర్‌బీఐ నిబంధనలను పాటిస్తామని గూగుల్‌ తెలిపింది. అయితే, ఇందుకు గడువును మరో రెండు నెలలు పొడిగించి, డిసెంబర్‌ వరకు అవకాశం ఇవ్వాలని కోరింది. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌  అమెరికా పర్యటన సమయంలో గూగుల్‌ ఈ విషయాన్ని తెలియజేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ గత నెలలో క్యాలిఫోర్నియాలోని గూగుల్‌ ప్రధాన కార్యాలయంలో సీఈవో

జేపీ అసోసియేట్స్‌పై దివాలా పిటీషన్‌ !

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: జైప్రకాశ్‌ అసోసియేట్స్‌కు వ్యతిరేకంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ దివాలా పిటీషన్‌ దాఖలు చేసింది. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)అలహాబాద్‌ బెంచ్‌లో ఈ దివాలా పిటీషన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్‌ దాఖలు చేసింది. దివాలా  నోటీసును మూడు రోజుల్లో జేపీ అసోసియేట్స్‌కు పంపించాలని ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఎన్‌సీఎల్‌టీ అలహబాద్‌ బెంచ్‌ ఆదేశించింది. మరోవైపు ఈ నెల 17లోపు దీనికి సమాధానం ఇవ్వాలని జేపీ అసోసియేట్స్‌ను కూడా ఆదేశించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ అభ్యర్థనను మన్నించి

Most from this category