STOCKS

News


బ్యాంకులకు రూ.1,700 కోట్లకు టోపీ

Saturday 29th September 2018
news_main1538200614.png-20689

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:
టెలికం, నెట్‌వర్కింగ్‌, పవర్‌ కన్వర్షన్ పరికరాల తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ వీఎంసీ సిస్టమ్స్‌.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియానికి రూ.1,700 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టింది. పీఎన్‌బీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వీఎంసీతో పాటు, కంపెనీ ప్రమోటర్లు ఉప్పలపాటి హిమబిందు, ఉప్పలపాటి వెంకట రామారావు, బి.వెంకట రమణపై కేసు నమోదు చేసింది. వీరిపై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ కేసులు పెట్టటమే కాక... వీఎంసీ సిస్టమ్స్‌ ఆఫీసుతో పాటు డైరెక్టర్ల నివాసాల్లో మొత్తం మూడు చోట్ల సోదాలు కూడా చేసింది. సంస్థకు హైదరాబాద్‌ దగ్గర్లోని రావిర్యాల వద్ద ప్లాంటు ఉంది. ఇక్కడ ఉత్పత్తయ్యే ఉపకరాలను బీఎస్‌ఎన్‌ఎల్‌తోపాటు వివిధ కంపెనీలకు సరఫరా చేస్తోంది. ఆకాశ్‌ ట్యాబ్లెట్ల విషయంలో దేశవ్యాప్తంగా వివాదాల్లో చిక్కుకున్న డేటావిండ్‌తో ఈ కంపెనీకి గతంలో భాగస్వామ్యం ఉండేది. ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లను డేటావిండ్‌తో పాటు పలు కంపెనీలకు సరఫరా చేసింది.
ఇవీ కేసు పూర్వాపరాలు..
నిర్వహణ మూలధనం కోసమని వీఎంసీ సిస్టమ్స్‌ 2009 ఆగస్టు 12న పీఎన్‌బీ, ఎస్‌బీఐ, కార్పొరేషన్‌ బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌, జెఎం ఫైనాన్షియల్‌ అసెట్స్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీల నుంచి రూ.1,010.50 కోట్లు రుణంగా తీసుకుంది. ఈ రుణాలు చెల్లించకుండా డిఫాల్టయింది. బ్యాంకులు ఆరా తీయడంతో కంపెనీ అక్రమాలు బయటపడ్డాయి. రూ.1,010.50 కోట్ల నిర్వహణ మూలధన రుణాల్లో రూ.43.83 కోట్లను బ్యాంకుల అనుమతి లేకుండానే ఏప్రిల్‌ 2013- ఏప్రిల్‌ 2014 మధ్య వేరే బ్యాంకుల ఖాతాలకు మళ్లించింది. మిగతా నిధులను కూడా ఇలాగే వేరే ఖాతాలకు దారి మళ్లించి ప్రమోటర్లు స్వాహా చేసినట్టు సీబీఐకి పీఎన్‌బీ ఫిర్యాదు చేసింది. తీసుకున్న అప్పు ఇప్పుడు వడ్డీతో కలిపి రూ.1,700 కోట్లయింది. దీన్లో రూ.539 కోట్లు పీఎన్‌బీకే రావాలి. మిగిలిన రూ.1,207 కోట్లు ఎస్‌బీఐ, కార్పొరేషన్‌ బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌, జెఎం ఫైనాన్షియల్‌ అసెట్స్‌ రీకన్‌స్ట్రక్షన్‌లకు రావాల్సి ఉంది. 
అన్నీ అబద్దాలే..
అప్పులు తీర్చాలంటూ బ్యాంకులు ఒత్తిడి చేయడంతో వీఎంసీ ఏదో ఒక సాకు చెబుతూ వచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి తమకు రూ.262 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్టు చెప్పింది. అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు ఆరా తీయగా వీఎంసీకి తాము చెల్లించాల్సింది రూ.33  కోట్లు మాత్రమేనని బీఎస్‌ఎన్‌ఎల్‌ తేల్చి చెప్పింది. ఇంకా ఐటీఐ లిమిటెడ్‌, న్యుట్రినో పవర్‌ సిస్టమ్స్‌, వీపీ సిస్టమ్స్‌ల నుంచి రూ.352.99 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉన్నట్టు వీఎంసీ చెప్పింది. ఎస్‌బీఐ అధికారులు దీనిపై ఆరా తీయగా, అవన్నీ అబద్ధాలేనని తేలటంతో.. పీఎన్‌బీ సీబీఐని ఆశ్రయించింది. బ్యాంకు రుణాలను ప్రమోటర్లు ఏయే ఖాతాలకు మళ్లించారనే అంశంపైనా సీబీఐ శోధిస్తోంది. You may be interested

బంధన్‌ బ్యాంకుకు షాక్‌

Saturday 29th September 2018

ముంబై: లైసెన్స్‌ నిబంధనలు పాటించని కారణంగా... కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న బంధన్‌ బ్యాంకుపై ఆర్‌బీఐ కఠిన చర్యలకు దిగింది. కొత్త శాఖలు ఏర్పాటు చేయవద్దని ఆదేశించడంతో పాటు, బ్యాంకు సీఈవో చంద్రశేఖర్‌ ఘోష్‌ పారితోషికాన్ని స్తంభింపజేసింది. ‘‘బ్యాంకులో నాన్‌ ఆపరేటివ్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్‌ కంపెనీ (ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ) వాటాను 40 శాతానికి తీసుకురానందుకు కొత్త శాఖల ఏర్పాటుకు ఇచ్చిన అనుమతిని ఆర్‌బీఐ ఉపసంహరించుకుంది. ఇకపై ఏ ఒక్క శాఖ ఏర్పాటు చేయాలన్నా

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు..

Saturday 29th September 2018

ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. జపాన్‌ నికాయ్‌ 225 ఏకంగా 323 పాయింట్ల లాభంతో 24,120 పాయింట్లకు పెరిగింది. దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 12 పాయింట్ల నష్టంతో 2,343 పాయింట్ల వద్ద ముగిసింది. హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 73 పాయింట్ల లాభంతో 27,788 పాయింట్లకు పెరిగింది. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 21 పాయింట్ల లాభంతో 3,257 పాయింట్లకు ఎగసింది. తైవాన్‌ సూచీ

Most from this category