News


తగ్గిన కెనరా బ్యాంకు నష్టాలు

Saturday 11th May 2019
news_main1557556169.png-25682

మార్చి క్వార్టర్లో రూ.551కోట్లకు పరిమితం
గణనీయంగా తగ్గిన మొండి బకాయిలు

న్యూఢిల్లీ: కెనరా బ్యాంకు నష్టాలు మార్చి త్రైమాసికంలో చాలా వరకు తగ్గాయి. 2017-18 మార్చి త్రైమాసికంలో బ్యాంకు రూ.4,859 కోట్ల నష్టాలను ఎదుర్కోగా, 2018-19 మార్చి త్రైమాసికం నాటికి నష్టాలను రూ.551 కోట్లకు తగ్గించుకుంది. ఎన్‌పీఏలకు కేటాయింపులు తగ్గడం ఇందుకు కారణమైంది. మార్చి త్రైమాసికంలో బ్యాంకు రూ.14,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో వచ్చిన రూ.11,555 కోట్ల ఆదాయంతో పోలిస్తే 20 శాతం పెరిగింది. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు రూ.347 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2017-18లో బ్యాంకు రూ.4,222 కోట్ల నష్టాన్ని చవిచూడడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఆదాయం రూ.53,385 కోట్లకు పెరిగింది. 
ఆస్తుల నాణ్యత మెరుగు
బ్యాంకుల ఆస్తుల నాణ్యత మార్చి క్వార్టర్లో గణనీయంగా మెరుగుపడింది. అంతక్రితం ఏడాది ఇతే త్రైమాసికంలో స్థూల ఎన్‌పీఏలు 11.84 శాతంగా ఉండగా, అవి 8.83 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 7.48 శాతం నుంచి 5.37 శాతానికి పరిమితమయ్యాయి. విలువ పరంగా చూస్తే స్థూల ఎన్‌పీఏలు రూ.39,224 కోట్లు, నికర ఎన్‌పీఏలు రూ.22,955 కోట్లుగా ఉన్నాయి. ప్రొవిజన్లు (ఎన్‌పీఏలకు కేటాయింపులు) రూ.8,762 కోట్ల నుంచి రూ.5,120 కోట్లకు తగ్గాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు కలసి రూ.55,230 కోట్లకు పరిమితం అయ్యాయి. ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా మార్చి త్రైమాసికంలో ఎంఎస్‌ఎంఈ ఖాతాలకు సంబంధించి రూ.41,602 కోట్ల రుణాలను పునరుద్ధరించినట్టు బ్యాంకు తెలిపింది. ఆరు మోసపూరిత ఖాతాలను గుర్తించామని, వీటి విలువ రూ.704 కోట్లుగా పేర్కొంది. ప్రొవిజన్‌ కవరేజీ రేషియో 68.13 శాతంగా ఉంది. 



You may be interested

ఐటీసీ ఛైర్మన్‌ దేవేశ్వర్ కన్నుమూత

Saturday 11th May 2019

కార్పోరేట్‌ దిగ్గజం ఐటీసీ ఛైర్మన్‌ వైసీ దేవేశ్వర్‌(72) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. దేవేశ్వర్‌ ఫిబ్రవరి 4, 1947లో లాహోర్‌ జన్మించారు. ఐఐటీ డిల్లీలో, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. ఐటీసీ కంపెనీలో 1968లో సామాన్య ఉద్యోగిగా తన జీవితాన్ని మొదలుపెట్టారు. అంచెంచెలుగా ఎదుగుతూ 1996 నాటికి కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ స్థాయికి చేరుకున్నారు. 2017లో కంపెనీ నాన్‌ ఎగ్జూక్యూటివ్‌ ఛైర్మన్‌

ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.3,418 కోట్లు

Saturday 11th May 2019

న్యూఢిల్లీ: ఇన్‌ఫ్రా దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం(2018-19) మార్చి క్వార్టర్‌లో రూ.3,418 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017-18) ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం(రూ.3,167 కోట్లు)తో పోల్చితే 8 శాతం వృద్ధి సాధించామని ఎల్‌ అండ్ టీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.41,091 కోట్ల నుంచి రూ.45,555 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు

Most from this category