STOCKS

News


కెనరా బ్యాంక్‌ లాభం రూ.3000 కోట్లు

Thursday 1st November 2018
news_main1541052491.png-21630

బెంగళూరు: కెనరా బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 15 శాతం పెరిగి రూ.300 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కెనరా బ్యాంక్‌ తెలియజేసింది. ఆదాయం 6 శాతం పెరిగి రూ.12,679 కోట్లకు చేరుకుంది. రుణాలు 14 శాతం వృద్ధి చెందాయని, గత క్యూ2లో 11.05 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 10.56 శాతానికి తగ్గాయని బ్యాంకు పేర్కొంది. అలాగే నికర మొండి బకాయిలు 6.91 శాతం నుంచి 6.54 శాతానికి తగ్గాయని వివరించింది.
సిండికేట్‌ బ్యాంక్‌ నష్టాలు రూ.1,543 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సిండికేట్‌ బ్యాంక్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.1,543 కోట్ల నికర నష్టాలొచ్చాయి. గత క్యూ2లో రూ.105 కోట్ల నికర లాభం వచ్చిందని సిండికేట్‌ బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు బాగా పెరగడంతో ఈ స్థాయి నష్టాలు వచ్చాయని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.6,419 కోట్ల నుంచి రూ.5,889 కోట్లకు తగ్గింది. గత క్యూ2లో 9.39 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు 12.98 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు 5.76 శాతం నుంచి 6.83 శాతానికి పెరిగాయి. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.735 కోట్ల నుంచి రూ.1,622 కోట్లకు పెరిగాయి.You may be interested

ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.2,593 కోట్లు

Thursday 1st November 2018

28 శాతం వృద్ధి  న్యూఢిల్లీ: మౌలిక రంగ దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌ అండ్‌ టీ) నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 28 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.2,020 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.2,593 కోట్లకు పెరిగిందని ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.26,846 కోట్ల నుంచి రూ.32,506 కోట్లకు ఎగసింది. మొత్తం

టాటామోటర్స్‌ నష్టాలు రూ.1009 కోట్లు

Thursday 1st November 2018

బలహీనంగా జేఎల్‌ఆర్‌ పనితీరు పుంజుకున్న దేశీయ వ్యాపారం 3 శాతం పెరిగి రూ.72,112 కోట్లకు ఆదాయం ముంబై: టాటా మోటార్స్‌ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,009 కోట్ల నికర నష్టాలొచ్చాయి. కంపెనీ అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) పనితీరు బలహీనంగా ఉండటంతో ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.2,502 కోట్ల నికర లాభం వచ్చిందని టాటా

Most from this category