STOCKS

News


కెనరా బ్యాంక్‌ బాండ్ల జారీ ఆరంభం

Saturday 23rd March 2019
Markets_main1553326007.png-24766

కెనరా బ్యాంక్‌ బాండ్ల జారీ ఆరంభం
-రూ.2,750 కోట్లు సమీకరణ 
-సింగపూర్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్‌ 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ బాండ్ల జారీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. తమ లండన్‌ బ్రాంచ్‌ ఈ బాండ్లను జారీ చేస్తుందని, ఈ బాండ్ల ద్వారా 40 కోట్ల డాలర్లు(సుమారుగా రూ.2,750 కోట్లు) సమీకరించనున్నామని కెనరా బ్యాంక్‌ తెలిపింది. మీడియమ్‌ టర్మ్‌ నోట్‌ (ఎమ్‌టీఎన్‌) ప్రోగ్రామ్‌ కింద ఈ సీనియర్‌ అన్‌ సెక్యూర్డ్‌ బాండ్లు(మీడియన్‌ టర్మ్‌ నోట్స్‌)ను జారీ చేస్తున్నామని పేర్కొంది. ఈ బాండ్లు 2024, మార్చి 28న మెచ్యూరవుతాయని తెలిపింది. ఈ బాండ్ల ద్వారా సమీకరించిన నిధులను బ్యాంక్‌ విదేశీ బ్రాంచ్‌ల దీర్ఘకాల ఆస్తులను సమకూర్చుకోవడం కోసం వినియోగిస్తామని వివరించింది. ఈ బాండ్లు సింగపూర్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో లిస్ట్‌ అవుతాయని, ఈ బాండ్ల ధరలను ఐదేళ్ల అమెరికా ట్రెజరీ బాండ్ల ధరకు అదనంగా 170 బేసిస్‌ పాయింట్ల ధరను నిర్ణయించామని, కూపన్‌ రేటు​ 3.875 శాతమని, ఆరు నెలలకొకసారి వడ్డీని చెల్లిస్తామని కెనరా బ్యాంక్‌ తెలిపింది. 



You may be interested

11400 వద్దకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 23rd March 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం భారీ నష్టాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపు(11470)తో పోలిస్తే 63 పాయింట్ల నష్టంతో 11,407.00 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11472.40 పాయింట్లతో పోలిస్తే 71 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. వచ్చే వారంలో గురువారం(28న)మార్చి డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు ఉండటంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇక

-ప్రభుత్వానికి రూ.1,143 కోట్ల డివిడెండ్‌ చెల్లింపులు

Saturday 23rd March 2019

-ప్రభుత్వానికి రూ.1,143 కోట్ల డివిడెండ్‌ చెల్లింపులు -26 శాతం వృద్ధితో రూ.4,508 కోట్లకు నికర లాభం  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సం‍స్థ ఆర్‌ఈసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.11 (110 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను  ప్రకటించింది. డివిడెండ్‌ చెల్లింపుల్లో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,143 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించింది.  ఈ మొత్తానికి సమానమైన ఆర్‌టీజీఎస్‌  క్రెడిట్‌ అడ్వైస్‌ను ఆర్‌ఈసీ ప్రభుత్వానికి అందజేసింది. ఈ క్రెడిట్‌ అడ్వైస్‌ను

Most from this category