STOCKS

News


బ్రూక్‌ఫీల్డ్‌ చేతికి హైదరాబాద్‌ కంపెనీ?

Tuesday 23rd April 2019
news_main1555996109.png-25286

  • 1.5 బిలియన్‌ డాలర్లతో మైత్రా ఎనర్జీ కొనుగోలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ హైదరాబాద్‌కు చెందిన పునరుత్పాదక ఇంధన సంస్థ మైత్రా ఎనర్జీ ఇండియాను కొనుగోలు చేయనుంది. 1–1.5 బిలియన్‌ డాలర్ల డీల్‌తో మెజారిటీ వాటాను దక్కించుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలియవచ్చింది. ఇది సాకారమైతే దేశంలోని రెన్యూవబుల్‌ ఎనర్జీ విభాగంలో ఇదే అతిపెద్ద డీల్‌గా నిలవనుంది. ప్రస్తుతం మైత్రా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో రెన్యూవబుల్‌ ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తోంది. 
పిరమల్‌ గ్రూప్‌ రుణం చెల్లింపు...
మైత్రా ఎనర్జీ సంస్థ 2017 సెప్టెంబర్‌లో పిరమల్‌ గ్రూప్‌ నుంచి నాన్‌–కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ ద్వారా రూ.1,800 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఈ రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు ఈ డీల్‌ ఉపయోగపడుతుందని.. వాస్తవానికి ఈ డీల్‌ సక్సెస్‌లో రీ పేమెంటే ప్రధానంగా నిలవనుందని తెలిసింది. అయితే ఈ డీల్‌ గురించి ఇరు వర్గాలు ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.



You may be interested

సెప్టెంబర్‌ కల్లా రెండు రైల్వే ఐపీఓలు!

Tuesday 23rd April 2019

 ఐఆర్‌సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీఓలపై కసరత్తు రూ.1,500 కోట్ల సమీకరించనున్న కేంద్రం  న్యూఢిల్లీ: రైల్వేలకు చెందిన ఐఆర్‌సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీల ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ఈ ఏడాది సెప్టెంబర్‌ కల్లా వచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు. ఎన్నికలు పూర్తయి, కొత్త ప్రభుత్వం కొలువు దీరాక ఐపీఓ సంబంధిత పత్రాలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పిస్తామన్నారు. ఇండియన్‌​ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)

ఎస్‌బీఐ జనరల్ నుంచి సైబర్ బీమా పాలసీ

Tuesday 23rd April 2019

న్యూఢిల్లీ: సైబర్ దాడుల కారణంగా ఆర్థిక నష్టాలు, ప్రతిష్ట దెబ్బతినడం మొదలైన వాటి నుంచి వ్యాపార సంస్థలకు రక్షణనిచ్చేలా ప్రత్యేకంగా బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. ప్రారంభ దశలో చిన్న, మధ్య తరహా సంస్థలపై దృష్టి పెడతామని, ఆ తర్వాత పెద్ద కార్పొరేట్ సంస్థలకు కూడా అందించనున్నామని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం అన్ని రకాలు, పరిమాణాల వ్యాపార సంస్థలకు సైబర్ దాడుల ముప్పు పెరిగిపోయిందని,

Most from this category