STOCKS

News


కాల్ కనెక్షన్‌ టైమ్‌పైనా ట్రాయ్ దృష్టి

Thursday 11th October 2018
news_main1539231982.png-21039

న్యూఢిల్లీ: టెల్కోలు మరింత మెరుగైన సర్వీసులు అందించేలా టెలికం రంగ నియంత్రణ ట్రాయ్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. తాజాగా కాల్ కనెక్షన్ టైమ్‌, కాల్ మ్యూట్ అంశాలను కూడా నాణ్యతా ప్రమాణాల జాబితాలోకి చేర్చింది. అక్టోబర్ 1 నుంచి వీటికి సంబంధించిన డేటాను సేకరిస్తున్నట్లు, తగు పరిష్కార మార్గాలను కనుగొనడంపై దృష్టి పెట్టనున్నట్లు ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ తెలిపారు. నంబర్ డయల్ చేసిన తర్వాత కాల్ కనెక్ట్ అవడానికి పట్టే వ్యవధిని కాల్ కనెక్షన్ టైమ్‌గా వ్యవహరిస్తారు. ఇటీవలి కాలంలో కొన్ని సందర్భాల్లో డయల్ చేసిన 30 సెకన్ల దాకా కూడా కాల్ కనెక్ట్ కాకపోతుండటాన్ని గుర్తించిన ట్రాయ్‌ .. తగు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు శర్మ తెలిపారు. సాధారణంగా 2జీ, 3జీ, 4జీ అంటూ రకరకాల టెక్నాలజీలు వినియోగంలో ఉన్నప్పుడు ఒక నెట్‌వర్క్‌ నుంచి మరో నెట్‌వర్క్‌కు సిగ్నల్ కనెక్ట్ కావడానికి సమయం పట్టేయొచ్చని, టెక్నాలజీపరమైన ఈ అంశం టెల్కోల నియంత్రణలో ఉండదని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ.. కాల్ కనెక్షన్ టైమ్‌ సగటున ఎంత ఉండొచ్చు, అసాధారణంగా పెరిగితే తీసుకోతగిన చర్యలు ఏమిటి మొదలైన అంశాలు పరిశీలించనున్నట్లు శర్మ వివరించారు. 



You may be interested

ఏటీఎఫ్‌పై తగ్గిన ఎక్సైజ్‌ డ్యూటీ

Thursday 11th October 2018

న్యూఢిల్లీ: ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించిన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విమాన ఇంధనంగా పిలిచే ఏటీఎఫ్‌పై డ్యూటీని 14 శాతం నుంచి 11 శాతానికి తగ్గించిన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజా తగ్గింపు అక్టోబరు 11 (బుధవారం) నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు ఏటీఎఫ్ ధర రూ.74.56 వద్ద ఉంది. ముడిచమురు ధరల పెరుగుదల నేపథ్యంలో గతేడాది జులై నుంచి ఇప్పటివరకు

ఐడీబీఐ బ్యాంక్‌ చీఫ్‌గా రాకేశ్‌ శర్మ బాధ్యతలు!

Thursday 11th October 2018

ముంబై: ఐడీబీఐ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఎండీ, సీఈఓ)గా బుధవారం రాకేశ్‌ శర్మ బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్‌ 5న ఐడీబీఐ బ్యాంక్‌ చీఫ్‌గా శర్మ పేరును కేంద్రం ప్రకటించింది. ఆరు నెలలు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. 2015 సెప్టెంబర్‌ 11 నుంచి 2018 జూలై 31వ తేదీ వరకూ శర్మ కెనరాబ్యాంక్‌ ఎండీ, సీఈఓగా పనిచేసి పదవీ విరమణ చేశారు. అంతకుముందు 2014 ఏప్రిల్‌

Most from this category