STOCKS

News


'సింగిల్' రిటైలర్ల నిబంధనల సడలింపుపై కేంద్రం కసరత్తు

Thursday 14th February 2019
Markets_main1550125607.png-24192

న్యూఢిల్లీ: విదేశీ సింగిల్ బ్రాండ్ రిటైలర్లను ఆకర్షించే దిశగా నిబంధనలను సడలించాలని కేంద్రం యోచిస్తోంది. ఆయా సంస్థలు తప్పనిసరిగా 30 శాతం స్థానికంగా కొనుగోళ్లు జరపాల్సి ఉంటుందన్న సోర్సింగ్‌ నిబంధనకు సంబంధించి కాలావధి విషయంలో కొంత వెసులుబాటునివ్వాలని భావిస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ ప్రతిపాదనకు సంబంధించి ఇప్పటికే వివిధ శాఖలకు ముసాయిదా క్యాబినెట్ నోట్‌ను పంపింది. ఆయా శాఖల నుంచి అభిప్రాయాలు అందగానే, క్యాబినెట్‌ ముందు ప్రతిపాదనలు ఉంచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదనల ప్రకారం.. యాపిల్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు 200 మిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తెచ్చిన పక్షంలో ఆఫ్‌లైన్‌ స్టోర్స్ ఏర్పాటుకన్నా ముందు ఆన్‌లైన్ స్టోర్స్‌ ఏర్పాటుకు అనుమతించే అవకాశాలు ఉన్నాయి. ఆన్‌లైన్ అమ్మకాలు మొదలుపెట్టిన తర్వాత రెండేళ్లలోగా ఈ సంస్థలు ఆఫ్‌లైన్ స్టోర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ సింగిల్ బ్రాండ్ రిటైల్ సంస్థలు.. ఆఫ్‌లైన్ స్టోర్ ఏర్పాటు చేసిన తర్వాతే ఆన్‌లైన్ అమ్మకాలు జరిపేందుకు అనుమతిస్తున్నారు. మరోవైపు, పెట్టుబడి పరిమాణాన్ని బట్టి సోర్సింగ్ నిబంధనలను సడలించే అంశం కూడా వాణిజ్య శాఖ ప్రతిపాదనల్లో ఉంది. ప్రస్తుతం అయిదేళ్లుగా ఉన్న కాలవ్యవధిని 6-10 ఏళ్ల దాకా పొడిగించవచ్చు.



You may be interested

10700 దిగువన స్వల్పకాలిక బేరిష్‌నెస్‌

Thursday 14th February 2019

బొనాంజ పోర్టుఫోలియో  దేశీయ సూచీలు కొంతకాలంగా స్వల్పకాలిక రేంజ్‌లోనే కదలాడుతూఉన్నాయి. ఇటీవల నిఫ్టీ అప్‌సైడ్‌ బ్రేకవుట్‌ ఇచ్చినట్లు కనిపించినా చివరకు అది ఫాల్స్‌ బ్రేకవుట్‌గా ముగిసిపోయింది. నిఫ్టీకి 11100 పాయింట్ల వద్ద అత్యంత బలమైన నిరోధం ఎదురవుతోంది. ఈ స్థాయిని ఛేదించలేక నిఫ్టీ మరోమారు 10730 పాయింట్ల వరకు వెనుకంజ వేసింది. ప్రస్తుతం చార్టుల్లో ఇండికేటర్లు బేరిష్‌క్రాసోవర్‌ చూపుతున్నాయి. ఆప్షన్స్‌ పరంగా నిఫ్టీ 11000 వద్ద కాల్స్‌ అధికంగా ఉండగా, 10400

ఐఎల్‌ఎఫ్ఎస్ సంక్షోభంపై ఎంక్వైరీ కమిషన్‌ వేయాలి

Thursday 14th February 2019

- పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వ్యవహారంపై ప్రత్యేకంగా ఎంక్వైరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ ఆర్థికాంశాల స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఈ వివాదంలో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల పాత్రపైనా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సీనియర్ కాంగ్రెస్ నేత ఎం వీరప్ప మొయిలీ నేతృత్వంలోని స్థాయీ సంఘం ఈ మేరకు పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. "ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర

Most from this category