STOCKS

News


జపాన్‌తో కరెన్సీ మార్పిడి ఒప్పందం

Friday 11th January 2019
Markets_main1547185622.png-23524

పచ్చజెండా ఊపిన కేం‍ద్ర కేబినెట్‌
కరెన్సీ విలువల్లో అస్థిరతలు తగ్గించడమే లక్ష్యం

న్యూఢిల్లీ: జపాన్‌, భారత్‌ మధ్య మరో కీలక ఒప్పందానికి వీలుగా కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కరెన్సీ విలువల్లో అస్థిరతలకు చెక్‌ పెట్టేందుకు గాను జపాన్‌తో 75 బిలియన్‌ డాలర్ల మేర ద్వైపాక్షిక స్వాప్‌ ఏర్పాటు ప్రతిపాదనకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీ ఆమోదం తెలిపింది. రెండు దేశాల మధ్య గరిష్టంగా 75 బిలియన్‌ డాలర్ల విలువ మేర ద్వైపాక్షిక స్వాప్‌ ఏర్పాటుకు గాను... బ్యాంకు ఆఫ్‌ జపాన్‌తో ఆర్‌బీఐ ఒప్పందం చేసుకునేందుకు కేంద్రం అధికారం కల్పించినట్టు అవుతుంది. ‘‘స్వాప్‌ ఏర్పాటు అన్నది భారత్‌, జపాన్‌ మధ్య గరిష్టంగా 75 బిలియన్‌ డాలర్ల విలువ మేర దేశీ కరెన్సీ మార్పిడి కోసం. విదేశీ మారకంలో స్వల్పకాల లోటును అధిగమించేందుకు, తగినంత బ్యాలన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌ను కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది. ద్వైపాక్షిక స్వాప్‌ ఏర్పాటు క్లిష్ట సమయాల్లో పరస్పరం సహకరించుకుకోవాలన్న భారత్‌, జపాప్‌ వ్యూహాత్మక లక్ష్యానికి చక్కని ఉదాహరణ’’ అని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంతో కరెన్సీ పరంగా స్థిరత్వం ఏర్పడి, భారత కంపెనీలు విదేశీ నిధులను సులభంగా పొందే అవకాశాలు మెరుగుపడతాయి.
ఫ్రాన్స్‌తో మరో ఒప్పందం
నూనత, పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్‌, ఫ్రాన్స్‌ మధ్య సాంకేతిక సహకారం పెంపొందించే ఒప్పందానికి కూడా కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. అక్టోబర్‌ 3న ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందం జరగ్గా దీనికి కేబినెట్‌ తాజాగా ఆమోదం తెలిపింది. పరస్పర ప్రయోజనం, సమానత్వం కోసం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకోవాలన్నది ఒప్పందం లక్ష్యం.



You may be interested

జేఎల్‌ఆర్‌లో 4,500 ఉద్యోగాల కోత

Friday 11th January 2019

లండన్‌: టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌).. భారీ స్థాయిలో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అంతర్జాతీయంగా మొత్తం 4,500 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. చైనాలో అమ్మకాలు తగ్గడం, బ్రెగ్జిట్‌ అంశం కారణంగా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు జేఎల్‌ఆర్‌ సీఈఓ రాల్ఫ్‌ స్పెత్‌ వివరణ ఇచ్చారు. ‘సంస్థ దీర్ఘకాల మనుగడ కోసం ఈ నిర్ణయాత్మక చర్య తీసుకున్నాం. అనేక భౌగోళిక రాజకీయ

ఓలాకు రూ.520 కోట్ల పెట్టుబడులు

Friday 11th January 2019

సమకూర్చిన స్టెడ్‌వ్యూ క్యాపిటల్‌ మారిషస్‌  న్యూఢిల్లీ: ట్యాక్సీ అగ్రిగేటర్‌, ఓలాలో స్టెడ్‌వ్యూ క్యాపిటల్‌ మారిషస్‌ సంస్థ రూ.520 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. మొత్తం 2.45 లక్షల సిరీస్‌ జే ప్రిఫరెన్స్‌ షేర్లను ఒక్కోటీ రూ.21,250 చొప్పున జారీ చేసి ఈ నిధులు సమీకరించామని కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ (ఓలాను ఈ కంపెనీయే నిర్వహిస్తోంది) నివేదించింది. ఈ మేరకు ఈ నెల 9న జరిగిన

Most from this category