STOCKS

News


జీఎస్‌టీఎన్‌ ఇక పూర్తిగా ప్రభుత్వ సంస్థ

Thursday 27th September 2018
news_main1538024397.png-20630

జీఎస్‌టీకి ఐటీ వ్యవస్థను అందించే జీఎస్‌టీ నెట్‌వర్క్‌ (జీఎస్‌టీఎన్‌)ను నూరు శాతం ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ బుధవారం అనుమతి తెలిపినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. జీఎస్‌టీఎన్‌ను పునర్‌వ్యవస్థీకరించిన అనంతరం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యాజమాన్యాన్ని సమంగా వేరు విభజించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం జీఎస్‌టీఎన్‌లో కేంద్రం, రాష్ట్రాలకు కలిపి 49 శాతం వాటా ఉంది. మిగిలిన 51 శాతం వాటా హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్‌ఎస్‌ఈ స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు ఉంది. 
ఐటీడీసీ హోటళ్ల విక్రయాలు
పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా జమ్మూ కశ్మీర్‌, బిహార్‌ రాష్ట్రాల్లో ఐటీడీసీకి ఉన్న రెండు హోటళ్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విక్రయించాలని ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్‌ కమిటీ నిర్ణయించింది. You may be interested

గంటలో రూ. 1 కోటి రుణం..

Thursday 27th September 2018

న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) రుణ అవసరాలు తీర్చే దిశగా కేంద్రం ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది. www.psbloansin59minutes.com పేరిట ఏర్పాటు చేసిన ఈ పోర్టల్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆవిష్కరించారు. ఈ పోర్టల్‌ ద్వారా ఎంఎస్‌ఎంఈలు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి)తో పాటు అయిదు ప్రభుత్వ రంగ బ్యాంకులకు  రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  రూ. 1 కోటి

ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 4 శాతం వాటా విక్రయం

Thursday 27th September 2018

ముంబై: ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 4 శాతం వాటాను విక్రయించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. యాక్సిస్‌ ఏఎమ్‌సీ, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సంస్థలు ప్రమోట్‌ చేస్తున్న ఫండ్స్‌ ఈ వాటాను కొనుగోలు చేయనున్నాయి.  ఈ డీల్‌ విలువ రూ.482 కోట్లు. ఈ డీల్‌ పరంగా చూస్తే, ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ విలువ రూ.12,000 కోట్లని అంచనా. ఈ ఒప్పందంలో భాగంగా యాక్సిస్‌  ఏఎమ్‌సీ తరపున యాక్సిస్‌ న్యూ ఆపర్చునిటీస్‌ ఏఐఎఫ్‌-వన్‌ ఫండ్‌

Most from this category