STOCKS

News


యానివేషన్‌లో సీఏ చదువులు

Saturday 9th February 2019
news_main1549697391.png-24103


– వీడియోలతో ఫైనాన్స్‌ కోర్సుల బోధన
– ఇండిగోలెర్న్‌లో 12 సీఏ సబ్జెక్ట్‌లు; 20 వేల మంది విద్యార్థులు
– రెండేళ్లలో విదేశీ ఫైనాన్స్, అకౌంటింగ్‌ పాఠ్యాంశాలు కూడా..
– ఏడాదిలో రూ.20 కోట్ల నిధుల సమీకరణ పూర్తి
– ‘స్టార్టప్‌ డైరీ’తో కంపెనీ సీఈఓ శ్రీరామ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:
చార్టెర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ) చదువు కాస్త గజిబిజి గందరగోళమే. ఆర్ధికం, బిజినెస్‌ లా, స్టాటిస్టిక్స్‌.. ఇలా ప్రతీ సబ్జెక్ట్‌ క్లిష్టమైందే. అయితే దీన్ని అంత్యంత సులువు చేసేసింది ఇండిగోలెర్న్‌. యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్‌లతో సీఏ కోర్సును సులభంగా నేర్పిస్తోంది. ఇందుకోసం బాహుబలి, అవతార్‌ వంటి సినిమాలకు వీఎఫ్‌ఎక్స్‌ సేవలందించిన థండర్‌ స్టూడియోతో ఒప్పందం కూడా చేసుకుంది. మరిన్ని వివరాలు కంపెనీ సీఈఓ శ్రీరామ్‌ సోమయాజుల ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...
నాతో పాటూ సత్య రఘు మోక్కపాటి, శరత్‌ వేమూరి, సూరజ్‌ లకోటియా కలసి ఇండిగోలెర్న్‌ స్థాపించాం. ఇందులో శరత్‌ మినహా అందరం సీఏ పట్టభద్రులమే. క్లిష్టమైన సీఏ కోర్సులను సులువుగా అర్థమయ్యేలా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా నేర్పించాలనే లక్ష్యంతో నలుగురం కలిసి రూ.50 లక్షల పెట్టుబడితో 2017 మార్చిలో హైదరాబాద్‌ కేంద్రం ఇండిగోలెర్న్‌ ఎడ్యుటెక్‌ స్టార్టప్‌ను ప్రారంభించాం. ఆన్‌లైన్‌ వేదికగా ఫైనాన్స్, అకౌంటింగ్‌ కోర్సులను స్టోరీ టెల్లింగ్‌ విధానంలో నేర్పించడమే మా ప్రత్యేకత.
అందుబాటులో 12 సబ్జెక్ట్స్‌...
ప్రస్తుతం ఎకనామిక్స్, కామర్స్, ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్, బిజినెస్‌ లా, ఇన్‌కం ట్యాక్స్, జీఎస్‌టీ వంటి సుమారు 12 సబ్జెక్ట్స్‌ ఉన్నాయి. ఆయా సబ్జెక్ట్స్‌ వీడియోల అభివృద్ధికి ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి 10 మంది సీఏ నిపుణులతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలోనే మరో 6 మందిని నియమించుకోనున్నాం. ఒక్కో సబ్జెక్ట్‌ ధర రూ.3,000–4,500 వరకుంటాయి. ప్రతి నెలా 50 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేస్తున్నాం. ఏడాదిలో నెలకు రూ.కోటి ఆదాయాన్ని చేరుకోవాలని లక్ష్యించాం.
20 వేల మంది విద్యార్థులు..
దేశవ్యాప్తంగా 20 వేల మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 60 శాతం దక్షిణాది రాష్ట్రాల వాటా ఉంటుంది. నేపాల్, సౌదీ అరేబియా, ఆఫ్రికా వంటి దేశాల నుంచి కూడా విద్యార్థులున్నారు. ప్రతి వీడియో 10 నిమిషాల పాటు ఉంటుంది. వీడియో చూసే సమయంలో ఏమైనా సందేహాలొస్తే డిస్‌ప్లే కింద హెల్ప్‌ బటన్‌ ఉంటుంది. దానిని క్లిక్‌ చేసి సందేహాలను టైప్‌ చేస్తే చాలు నివృత్తి చేస్తాం. ఏడాదిలో ఫైనాన్స్‌ రిపోర్టింగ్, స్ట్రాటజిక్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్, స్ట్రాటజిక్‌ కాస్ట్‌ మేనేజ్‌మెంట్, అడ్వాన్స్‌ ఆడిటింగ్‌ వంటి మరొక 9 సబ్జెక్ట్‌లను జోడించనున్నాం. రెండేళ్లలో సీఎఫ్‌ఏ, సీపీఏ, సీఐఎంఏ వంటి విదేశీ ఫైనాన్స్‌ కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తాం.
ఏడాదిలో రూ.20 కోట్ల సమీకరణ...
ప్రస్తుతం మా కంపెనీలో 20 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో మరో 10 మందిని చేర్చుకుంటాం. ఇప్పటివరకు రెండు రౌండ్లలో కలిపి పలువురు వ్యక్తిగత పెట్టుబడిదారులు రూ.1.80 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ముగింపు నాటికి రూ.20 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పలువురు సంస్థాగత ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయని శ్రీరామ్‌ తెలిపారు.You may be interested

ఇండియాబుల్స్‌ ‘ఓక్‌నార్త్‌’లో సాఫ్ట్‌బ్యాంకు పెట్టుబడులు

Saturday 9th February 2019

న్యూఢిల్లీ: ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు చెందిన అసోసియేట్‌ కంపెనీ ఓక్‌నార్త్‌లో సాఫ్ట్‌బ్యాంకు రూ.2,800 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. ఓక్‌నార్త్‌ బ్రిటన్‌లో వాణిజ్య బ్యాంకుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బ్రాంచ్‌లు లేకుండా పూర్తి డిజిటల్‌ బ్యాంకుగా ఇది నడుస్తుండడం గమనార్హం. సాఫ్ట్‌బ్యాంకు తాజా పెట్టుబడితో ఓక్‌నార్త్‌ ఈక్విటీ క్యాపిటల్‌ రూ.7,000 కోట్లు అవుతుందని ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఓక్‌నార్త్‌ యూరోప్‌లో వేగంగా ఎదుగుతున్న కొత్త బ్యాంకుగా

ఇళ్లపై తగ్గనున్న జీఎస్టీ భారం

Saturday 9th February 2019

రేట్ల తగ్గింపునకు మంత్రుల బృందం సానుకూలత వచ్చే వారం కౌన్సిల్‌ భేటీలో దీనిపై నిర్ణయం న్యూఢిల్లీ: నివాసిత గృహాలపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి, అందుబాటు ధరల ఇళ్ల ప్రాజెక్టులపై జీఎస్టీని 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించేందుకు మంత్రుల బృందం తొలి భేటీలోనే సానుకూలత వ్యక్తం చేసింది. గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ అధ్యక్షతన మంత్రుల బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ గత నెలలో ఏర్పాటు

Most from this category