STOCKS

News


బైజూస్‌లో భారీగా పెట్టుబడులు

Thursday 13th December 2018
news_main1544677713.png-22884

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ బైజూస్‌... మరో విడత భారీగా పెట్టుబడులను సమీకరించింది. బైజూస్‌లో దక్షిణాఫ్రికా మీడియా దిగ్గజం, నాస్పర్స్‌ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలియవచ్చింది. నాస్పర్స్‌ సంస్థ రూ.2,879 కోట్లు (40 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. దీన్లో 30 కోట్ల డాలర్ల పెట్టుబడులు బైజూస్‌కు ఇప్పటికే అందాయని, మిగిలిన 10 కోట్ల డాలర్లు కూడా త్వరలోనే అందుతాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. తాజా పెట్టుబడుల రౌండ్‌లో భాగంగా ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం, జనరల్‌ అట్లాంటిక్‌,  కెనడాకు చెందిన సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్‌లు కూడా బైజూస్‌కు నిధులందించాయని సమాచారం. అయితే ఈ పెట్టుబడులకు సంబంధించిన వార్తలపై వ్యాఖ్యానించడానికి బైజూస్‌ ప్రతినిధి నిరాకరించారు. ఈ తాజా నిధులతో బైజూస్‌ సంస్థ విదేశాల్లో విస్తరించే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
నాలుగో అత్యంత విలువైన స్టార్టప్‌...
ఈ తాజా పెట్టుబడుల పరంగా చూస్తే, బైజూస్‌ స్టార్టప్‌ విలువ రూ.25,800 కోట్లుగా (360 కోట్ల డాలర్లు) ఉంటుందని అంచనా. అంటే దాదాపు 3.6 బిలియన్‌ డాలర్లు. ఈ విలువతో భారత్‌లో అత్యధిక విలువైన నాలుగో స్టార్టప్‌గా ఇది నిలిచింది. తొలి మూడు స్థానాల్లో డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎమ్‌, ట్యాక్సీ అగ్రిగేటర్‌ ఓలా, బడ్జెట్‌ హోటల్‌ చెయిన్‌ ఓయో ఉన్నాయి. కేరళకు చెందిన రవీంద్రన్‌ ఆరంభించిన బైజూస్‌ స్టార్టప్‌కు చాన్‌ జుకర్‌బర్గ్‌ ఇనీషియేటివ్‌ (సీజడ్‌ఐ), ప్రపంచ బ్యాంక్‌ సభ్య సంస్థ ఐఎఫ్‌సీ, టెన్సెంట్‌ హోల్డింగ్స్‌ వంటి అంతర్జాతీయ దిగ్గజ ఇన్వె‍స్ట్‌మెంట్‌ సంస్థలు దన్నుగా ఉన్నాయి. ఈ  ఆన్‌లైన్‌ ట్యుటోరియల్‌ స్టార్టప్‌ను థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహిస్తోంది. 
రూ. 100 కోట్లు దాటిన నెలవారీ ఆదాయం...
ఈ ఏడాది జూన్‌లో తమ నెలవారీ ఆదాయం రూ.100 కోట్లు దాటిందని బైజూస్‌ ప్రకటించింది. దీంతో తమ వార్షిక ఆదాయ లక్ష్యాన్ని రూ.1,400 కోట్లకు పెంచామని తెలియజేసింది. 2015లో ఈ లెర్నింగ్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని, అప్పటి నుంచి మూడేళ్లుగా వంద శాతం వృద్ధిని కొనసాగిస్తున్నామని తెలిపింది. కార్యకలాపాలు మొదలు పెట్టిన మొదటి ఏడాదిలోనే లాభాలు ఆర్జించడం ఆరంభించామని, తమకిపుడు 2 కోట్ల మంది నమోదిత విద్యార్ధులు, 12.6 లక్షల మంది వార్షిక చందాదారులు ఉన్నారని సంస్థ వివరించింది. ప్రస్తుతం ఈ సంస్థ రెండు యాప్‌లను అందిస్తోంది. ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి విద్యార్ధుల కోసం ఒక యాప్‌ను, నాలుగు, ఐదవ తరగతి విద్యార్థుల కోసం మరో యాప్‌ను నిర్వహిస్తోంది. You may be interested

17 నెలల కనిష్టానికి ద్రవ్యోల్బణం

Thursday 13th December 2018

న్యూఢిల్లీ: రిటైల్‌ ద్రవ్యోల్బణం మరింత కిందకు దిగొచ్చింది. కూరగాయలు, గుడ్లు, పప్పు ధాన్యాల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో నవంబర్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.33 శాతానికి పడిపోయింది. ఇది 17 నెలల్లోనే అత్యంత తక్కువ ద్రవ్యోల్బణం. వినియోగ ధరల ఆధారితంగా రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని లెక్కించే విషయం తెలిసిందే. ఇది అక్టోబర్‌ నెలలో 3.31 శాతంగా ఉందన్న గత అంచనాలను, తాజాగా 3.38 శాతానికి ప్రభుత్వం సవరించింది. 2017

2020లో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ ఐపీఓ !

Thursday 13th December 2018

ముంబై: సజ్జన్‌ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లోని సిమెంట్‌ విభాగం, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ 2020 కల్లా ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) రానుంది. ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.4,500 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా ప్రమోటర్‌ వాటాలో నాలుగో వంతు షేర్లను విక్రయించాలని జేఎస్‌డబ్ల్యూ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 12.8 మిలియన్‌ టన్నులుగా ఉంది. దీన్ని వచ్చే ఏడాదిమార్చి

Most from this category