STOCKS

News


బైజూ చేతికి అమెరికన్‌ కంపెనీ ఓస్మో

Friday 18th January 2019
Markets_main1547789162.png-23652

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ విద్యా సంస్థ బైజూస్‌ అమెరికాకు చెందిన ఓస్మో కంపెనీని 120 మిలియన్‌ డాలర్లకు (రూ.850 కోట్లు) కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. ఆటలతో కూడిన విద్యా విధానాలను ఓస్మో అందిస్తుంటుందని, భౌతిక రూపంలో ఉన్న బొమ్మలను ఆగ్మెంటెడ్‌ రియాలిటీ విధానంలో డిజిటల్‌ ప్రపంచంలోకి తీసుకురానున్నమని తెలిపింది. ఓస్మో స్వతంత్ర బ్రాండ్‌గానే కొనసాగుతుందని బైజూన్‌ ప్రకటించింది. అయితే, భౌతిక రూపం నుంచి డిజిటల్‌ రూపంలోకి మార్చే ఓస్మో సామర్థ్యాలు, కంటెంట్‌ను వినియోగించుకోవడం ద్వారా తన వ్యాపారాన్ని విస్తరించుకోనున్నట్టు తెలిపింది. చిన్నారులకు వినూత్నమైన, ప్రత్యేకమైన అధ్యయన సేవలు అందించేందుకు వీలు పడుతుందని పేర్కొంది.



You may be interested

పెట్రోలియం వ్యాపారంలోకి అదానీ గ్రూపు

Friday 18th January 2019

- జర్మన్‌ సంస్థ బీఏఎస్‌ఎఫ్‌తో జట్టు - రూ.16,000 కోట్లతో ముంద్రాలో కెమికల్‌ ప్లాంటు న్యూఢిల్లీ: గౌతం అదానీకి చెందిన అదానీ గ్రూపు పెట్రో కెమికల్స్‌ రంగంలోకి అడుగుపెడుతోంది. జర్మనీ దిగ్గజ కంపెనీ బీఏఎస్‌ఎఫ్‌తో కలసి గుజరాత్‌లోని ముంద్రా జిల్లాలో 2 బిలియన్‌ యూరోలతో (రూ.16,000 కోట్లతో) పెట్రో కెమికల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇరు సంస్థలు ఈ మేరకు గురువారం ‘వైబ్రంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2019’ వేదికగా అవగాహన

యూఎస్‌ కంపెనీతో అరబిందో రూ.2,100 కోట్ల డీల్‌

Friday 18th January 2019

ఏడు ఆంకాలజీ ఉత్పాదనల కొనుగోలు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ కంపెనీ అరబిందో ఫార్మా యూఎస్‌కు చెందిన స్పెక్ట్రమ్‌ ఫార్మాస్యూటికల్స్‌ నుంచి ఏడు బ్రాండెడ్‌ ఆంకాలజీ ఇంజక్టబుల్‌ ఉత్పాదనలను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు స్పెక్ట్రమ్‌ ఫార్మాతో అరబిందో అనుబంధ కంపెనీ అక్రోటెక్‌ బయోఫార్మా ఎల్‌ఎల్‌సీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ రూ.2,100 కోట్లపైమాటే. వ్యూహంలో భాగంగా యూఎస్‌ మార్కెట్లో బ్రాండెడ్‌ ఆంకాలజీ విభాగంలో అరబిందో ప్రవేశం, విస్తరణకు

Most from this category