STOCKS

News


రూ. 20 కడితే ఆధార్ సర్వీసులు

Friday 8th March 2019
news_main1552023627.png-24484

  • ఈ-కేవైసీ కోసం వ్యాపార సంస్థలకు యూఐడీఏఐ నోటిఫికేషన్‌

న్యూఢిల్లీ: కస్టమర్ ధృవీకరణ కోసం (కేవైసీ) ఆధార్ సర్వీసులు వినియోగించుకోవాలంటే వ్యాపార సంస్థలు ఇకపై ప్రతి వెరిఫికేషన్‌కు రూ. 20 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఆయా సంస్థలు జరిపే ప్రతి లావాదేవీ ధృవీకరణ కోసం 0.50 పైసలు చెల్లించాల్సి రానుంది. విశిష్ట ప్రాధికార గుర్తింపు కార్డుల సంస్థ (యూఐడీఏఐ) గురువారం ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. "ఆధార్ ధృవీకరణ సర్వీసులకోసం ప్రతి ఈ-కేవైసీ లావాదేవికి రూ. 20 (పన్నులు సహా), ఇతరత్రా ప్రతి లావాదేవీ ధృవీకరణ (యస్‌ లేదా నో) కోసం రూ. 0.50 (పన్నులు సహా) చెల్లించాల్సి ఉంటుంది" అని పేర్కొంది. "ఆధార్ లేకుండా కేవైసీ ధృవీకరణ జరపాలంటే ప్రస్తుతం వ్యాపార సంస్థలకు దాదాపు రూ. 150-200 దాకా ఖర్చవుతోంది. సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే ఆధార్ ఆధారిత కేవైసీ ధృవీకరణతో ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. దీంతో సౌలభ్యం దృష్ట్యా ఆధార్ ఆధారిత కేవైసీ సర్వీసుల కోసం ఆయా సంస్థలు కోరుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకోవడం జరిగింది" అని అధికారిక వర్గాలు తెలిపాయి. నోటిఫికేషన్ ప్రకారం.. 
- ఆధార్ సేవలను వినియోగించుకున్నాక ఇన్‌వాయిస్ వచ్చిన 15 రోజుల్లోగా వ్యాపార సంస్థలు నిర్దేశిత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గడువు దాటిన పక్షంలో నెలకు 1.5 శాతం చొప్పున వడ్డీ కట్టాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఈ-కేవైసీ సేవలు కూడా నిల్చిపోతాయి. 
- ఇప్పటికే ఆధార్ ఆధారిత ధృవీకరణ సర్వీసులు వినియోగించుకుంటున్న సంస్థలు.. తాజా నోటిఫికేషన్ విడుదల తర్వాత కూడా కొనసాగించిన పక్షంలో ఆయా సంస్థలు నిర్దేశిత నిబంధనలు, చార్జీలను అంగీకరించినట్లుగానే భావించడం జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆధార్ ఆర్డినెన్స్‌కు సవరణల కారణంగా ఆధార్ ఆథెంటికేషన్ సేవలు పొందేందుకు పలు సంస్థలకు అర్హత లభించినట్లవుతుందని వివరించాయి. అయితే, ఆయా సంస్థలు భద్రతాపరమైన షరతులన్నింటినీ పక్కాగా అమలుచేయాల్సి ఉంటుంది.
- ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ సేవలు అందిస్తునన్న షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులకు ఆథెంటికేషన్ చార్జీల నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, ఆధార్‌ నమోదు, అప్‌డేట్ లక్ష్యాలను అవి చేరలేకపోతే.. టార్గెట్‌కి తగ్గట్లుగా నిర్దేశిత మొత్తం కట్టాల్సి ఉంటుంది.



You may be interested

తొలిసారిగా రూ. 20 నాణేలు

Friday 8th March 2019

రూ. 1, 2, 5, 10 కాయిన్స్‌లో కొత్త సిరీస్‌ న్యూఢిల్లీ: కేంద్రం తొలిసారిగా రూ.20 నాణేలను ఆవిష్కరించింది. 12 కోణాల బహుభుజ ఆకృతిలో ఉండే ఈ నాణెంపై.. ధాన్యపుగింజలు ముద్రించి ఉంటాయి. దేశీయంగా వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేసేలా దీన్ని డిజైన్ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో తెలిపారు. దీనితో పాటు రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10

రూ.799కే ట్రూజెట్‌ విమానయానం

Friday 8th March 2019

- నేటి నుంచి సేల్‌ ప్రారంభం - ఈ నెల 17 వరకు లక్ష సీట్ల విక్రయం హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ట్రూజెట్‌ పేరుతో విమానయాన రంగంలో ఉన్న టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ గ్రేట్‌ టేకాఫ్‌ సేల్‌ను ప్రకటించింది. అన్ని రూట్లలో బేస్‌ ఫేర్‌ రూ.799గా ఉంటుంది. పన్నులు దీనికి అదనం. మార్చి 8 నుంచి మార్చి 17 మధ్యలో బుక్‌ చేసి... మార్చి 8 నుంచి అక్టోబరు 26 వరకు ప్రయాణించే

Most from this category