STOCKS

News


పెట్టుబడులకు బడ్జెట్‌ బూస్ట్‌

Saturday 13th July 2019
news_main1562995439.png-27035

  •  రాజ్యసభలో నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: పెట్టుబడుల పురోగతి, ద్రవ్య స్థిరీకరణ వంటి ఉన్నత లక్ష్యాల సాధనకు అనుగుణంగా 2019-20 బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఆయా కీలక లక్ష్యాల్లో రాజీలేదని స్పష్టం చేశారు. బడ్జెట్‌పై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ, వచ్చే 10 సంవత్సరాల్లో ‘‘సమగ్ర అభివృద్ధి చర్యల’’ను బడ్జెట్‌ నిర్దేశిస్తున్నట్లు తెలిపారు. ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడమే భారత్‌ లక్ష్యమని తెలిపారు. ఈ లక్ష్యంగా బడ్జెట్‌లో పలు చర్యలు తీసుకున్నట్లు ఆమె వివరించారు. పెట్టుబడుల పెంపు లక్ష్యంగా- విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల మరింత సరళీకరణ, తక్కువ స్థాయి కార్పొరేట్‌ పన్నును రూ.400 కోట్ల టర్నోవర్‌ వరకూ ఉన్న కంపెనీలకు వర్తింపు, ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగం పెంపునకు ప్రోత్సాహకాలు వంటి చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో  మౌలిక రంగంలోకి రూ.100 కోట్ల పెట్టుబడులు రావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 2019-20 బడ్జెట్‌ను ఈ నెల 5వ దీన ఆర్థికమంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పన్ను లక్ష్యాలను ఈ బడ్జెట్‌ 11.13 శాతం పెంపుతో రూ.16.49 లక్షల కోట్లుగా నిర్దేశించింది. ఆదాయ, వ్యయాలకు సంబంధించి ప్రతి అంచనా బడ్జెట్‌లో వాస్తవికంగా ఉందని ఆర్థికమంత్రి రాజ్యసభలో వివరించారు.



You may be interested

వడ్డి రేట్ల కోత బలమైన ఉద్దీపనం: మనిష్‌ గున్వానీ

Saturday 13th July 2019

 అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో పాటు ఇండియా మానెటరీ పాలసీలు కూడా పని చేస్తే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని రిలయన్స్‌ మూచ్యువల్‌ ఫండ్‌ సీఐఓ మనిష్‌ గున్వానీ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే...    రేట్ల కోత, అంతర్జాతీయ సంకేతాలే మూలం ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి ఎటువంటి కారకాలు పనిచేస్తాయో చెప్పడం కష్టం!  ప్రస్తుతం వాహనాల అమ్మకంలో మందగమనాన్ని ఆరు నెలల ముందు  అంచనా వేయలేకపోయాం.

ఇదిగో... మీ భూమి చరిత్ర!!

Saturday 13th July 2019

 ప్రాపర్టీ వివరాలన్నీ క్షణాల్లో ప్రత్యక్షం  విలువ, రుణాలు, అనుమతులు కూడా... ‘మైఓఎస్‌ ప్రాపర్టీ.కామ్‌’ ఘనత హైదరాబాద్‌ సహా 12 నగరాల్లో సేవలు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రాపర్టీ కొనాలన్నా, విక్రయించాలన్నా అంత తేలికేమీ కాదు. సవాలక్ష సందేహాలుంటాయి. మెట్రో నగరాల్లో అయితే మరీ ఎక్కువ!!. ఎంపిక చేసిన ప్రాపర్టీకి ఎలాంటి లీగల్‌ చిక్కులున్నాయో? వాస్తవానికి ఆయా ప్రాంతంలో ధర ఎంత ఉందో? ఒకవేళ కొన్నాక నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయో రావో..? బ్యాంక్‌ గృహ

Most from this category