STOCKS

News


3 నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల నిరవధిక సమ్మె

Thursday 29th November 2018
news_main1543470220.png-22473

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు డిసెంబర్ 3 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. కొత్త టెల్కో రిలయన్స్ జియోపై ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్న ఆరోపణలే ఇందుకు కారణం. టెలికం సేవల్లో జియోతో పోటీపడకుండా చేసేలా బీఎస్‌ఎన్ఎల్‌కు కేంద్రం 4జీ స్పెక్ట్రం కేటాయించలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. "ప్రస్తుతం మొత్తం టెలికం రంగం అంతా కూడా సంక్షోభంలో ఉంది. ఇదంతా కూడా ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో కారుచౌక చార్జీలతో మిగతా సంస్థలను దెబ్బతీయడం వల్లే జరుగుతోంది. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ సహా ఇతర పోటీ సంస్థలన్నింటినీ నామరూపాల్లేకుండా చేయాలన్నదే జియో వ్యూహం. ఆ తర్వాత నుంచి కాల్‌, డేటా చార్జీలను ఎకాయెకిన పెంచేస్తూ ప్రజలను లూటీ చేయబోతోంది. ఇలాంటి రిలయన్స్ జియోకి నరేంద్ర మోదీ ప్రభుత్వం బాహాటంగా మద్దతునిస్తుండటం ఆందోళనకరం" అని బీఎస్‌ఎన్‌ఎల్ యూనియన్లు (ఏయూఏబీ) ఒక సంయుక్త ప్రకటనలో ఆరోపించాయి. 4జీ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన స్పెక్ట్రంను తక్షణం కేటాయించడం, 2017 జనవరి 1 నుంచి వర్తించేలా ఉద్యోగుల జీతాలు, రిటైరీల పెన్షన్‌ సవరణ తదితర అంశాలను డిమాండ్ చేస్తున్నట్లు వివరించాయి. 
జియోకి వ్యతిరేకంగా ఎవర్నీ మాట్లాడనివ్వడం లేదు..
పోటీ సంస్థలను దెబ్బతీసేందుకు భారీగా అర్థబలం ఉన్న రిలయన్స్ జియో .. వ్యయాల కన్నా తక్కువ రేట్లతో సేవలు అందిస్తోందన్నాయి. దీంతో ఎయిర్‌సెల్‌, టాటా టెలీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌, టెలినార్ వంటి సంస్థలు మొబైల్ సర్వీసుల నుంచి తప్పుకున్నాయని పేర్కొన్నాయి. టెలికం శాఖ మాజీ కార్యదర్శి జేఎస్ దీపక్‌ సహా జియోకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఏయూఏబీ పేర్కొంది. "పోటీ సంస్థలను దెబ్బతీసేటువంటి చార్జీల విధానాన్ని అమలు చేస్తున్న జియోపై చర్యలు తీసుకోవాలంటూ ట్రాయ్‌కి జేఎస్ దీపక్‌ లేఖ రాశారు. ఫలితంగా ఆయన్ను వెంటనే టెలికం శాఖ నుంచి తప్పించేశారు. తద్వారా జియోకి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేసిన వారికి ఏం జరుగుతుందన్నది నరేంద్ర మోదీ ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలిచ్చింది" అని వ్యాఖ్యానించింది. You may be interested

రియల్‌మి 'యు1' స్మార్ట్‌ఫోన్‌

Thursday 29th November 2018

న్యూఢిల్లీ: చైనాకి చెందిన స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ రియల్‌మి తాజాగా 'యు1' పేరుతో మరో కొత్త ఫోన్‌ను బుధవారం భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధరల శ్రేణి రూ. 11,999 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 5 నుంచి ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేథ్‌ తెలిపారు.  మీడియాటెక్‌ హీలియో పి70 ప్రాసెసర్‌తో ఈ కేటగిరీలో యు1ను అత్యంత శక్తిమంతమైన సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌గా తీర్చిదిద్దినట్లు వివరించారు. యు1లో

ఎస్‌బీఐ డిపాజిట్‌ రేట్లు కొంచెం పెరిగాయ్‌!

Thursday 29th November 2018

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) స్థిర డిపాజిట్‌ రేట్లు వివిధ మెచ్యూరిటీలపై 10 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) వరకూ పెరిగి 6.80 శాతానికి చేరాయి. కోటి రూపాయల లోపు వివిధ డిపాజిట్లపై 5 నుంచి 10 బేసిస్‌ పాయింట్ల వరకూ పెరిగిన ఈ రేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని బ్యాంక్‌ తెలిపింది.   పెంపు వివరాల్లోకి వెళితే... ♦ ఏడాది- రెండేళ్ల

Most from this category