STOCKS

News


బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సమ్మె 10కి వాయిదా

Monday 3rd December 2018
Markets_main1543813845.png-22585

న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు ఈ నెల 3 నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెను 10వ తేదీకి వాయిదా వేసుకున్నారు. టెలికం శాఖ సెక్రటరీ అరుణ సుందర్‌రాజన్‌తో ఆదివారం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగ సంఘాలు చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాయి. 4జీ స్పెక్ట్రం కేటాయింపు, పెన్షన్‌ పునఃపరిశీలన, , బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల తరఫున పెన్షన్‌ చందా విషయంలో ప్రగతి ఉన్నట్టు అన్ని ఉద్యోగ సంఘాలతో కూడిన ఏయూఏబీ తెలిపింది. వేతన సవరణ విషయంలో సెక్రటరీ సమాధానం పట్ల తాము సంతృప్తి చెందలేదని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో కమ్యూనికేషన్ల మంత్రి మనోజ్‌ సిన్హాతో చర్చించేందుకు వీలుగా సమ్మెను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. చర్చలు సఫలం కాకపోతే 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్టు తెలిపింది.



You may be interested

ఆర్‌బీఐ పాలసీతో మార్కెట్లకు దిశానిర్దేశం

Monday 3rd December 2018

స్థూల గణాంకాలు, రూపాయి కదలికలూ కీలకం న్యూఢిల్లీ: కీలక వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం, స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిస్థితులు, రూపాయి కదలికలు తదితర అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. అలాగే, తయారీ, సేవల రంగాలకు సంబంధించిన పీఎంఐ గణాంకాలు కూడా కీలకంగా ఉండగలవని పేర్కొన్నారు. ఇక శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత విడుదలైన స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు ..

హెచ్‌1బీ వీసా కొత్త ప్రతిపాదనలతో అనిశ్చితి: నాస్కామ్‌

Monday 3rd December 2018

న్యూఢిల్లీ: హెచ్‌1బీ వీసాల కోసం కంపెనీలు ముందుగానే ఎలక్ట్రానిక్‌ రూపంలో నమోదు చేసుకోవాలనే అమెరికా నూతన ప్రతిపాదనతో అనిశ్చితి పెరుగుతుందని, అక్కడి ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని సాఫ్ట్‌వేర్‌ కంపెనీల సమాఖ్య ‘నాస్కామ్‌’ ఆందోళన వ్యక్తం చేసింది. హెచ్‌1బీ వీసాలకు సంబంధించిన 139 పేజీల ప్రతిపాదనను పూర్తిగా అధ్యయనం చేసి వాటి ప్రభావం అమెరికా కంపెనీలు, ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని తమ అభిప్రాయాల రూపంలో తెలియజేస్తామని ప్రకటించింది. ట్రంప్‌ సర్కారు

Most from this category