News


బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంటర్‌ప్రైజ్‌ విభాగ ఆదాయం రూ.6,500 కోట్లు

Wednesday 10th April 2019
news_main1554879561.png-25046

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం సంస్థ ‘బీఎస్‌ఎన్‌ఎల్‌’ రికార్డు స్థాయిలో ఎంటర్‌ప్రైజ్‌ విభాగం నుంచి ఆదాయాన్ని పొందినట్లు ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం నుంచి రూ.6,500 కోట్లను పొందినట్లు మంగళవారం ప్రకటించింది. గతంలో ఎన్నడూలేని విధంగా 91 ఎంటర్‌ప్రైజ్‌ల నుంచి ఈ మొత్తాన్ని పొందగా.. ఏడాది సగటున 50 నుంచి 60 ఎంటర్‌ప్రైజ్‌ల వరకూ ఉన్నట్లు తెలిపింది. ఈ అంశంపై సంస్థ సీఎండీ అనుపమ్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ సౌకర్యవంత స్థానంలోనే ఉంది. విభాగాలవారీగా ఆదాయంలో స్థిరీకరణ చోటుచేసుకుంటోంది. వినియోగదారులు, మొబిలిటీ విభాగాల్లో ఆదాయం కూడా మెరుగుపడుతోంది. గడ్డు పరిస్థితులను అధిగమించాం. నా ఐదేళ్ల పదవీకాలంలో సంస్థకు ఇబ్బంది లేదు. బంగారు గనిపై కూర్చుని ఉన్నామనే చెప్పాలి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ మా సంస్థ నెట్‌వర్త్‌ రూ.83,000 కోట్లని వెల్లడించింది. ఇది భారీ మొత్తంగానే భావిస్తున్నా. అసెట్‌ మోనటైజేషన్ ప్రారంభించినట్లయితే.. అనేక సమస్యలను చక్కబెట్టగలం. మా సంస్థకు కేవలం రూ.14,000 కోట్లు అప్పు మాత్రమే ఉంది. ఇతర టెలికం సంస్థలతో పోల్చితే ఇది చాలా తక్కువ. 4జీ సేవలు లేకుండానే పోటీలో నెగ్గుకురాగలుగుతున్నాం. ఇతర సంస్థలకు సబ్‌స్క్రైబర్లు తగ్గిపోతుంటే.. మాకు మాత్రం పెరుగుతున్నారు.’ అని వ్యాఖ్యానించారు.



You may be interested

ఇవేం నిబంధనలు!!

Wednesday 10th April 2019

- భారత డేటా లోకలైజేషన్, ఈకామర్స్‌ విధానాలపై అమెరికా విమర్శలు - వివక్షాపూరిత ప్రతిపాదనలని ఆక్షేపణ - పునఃసమీక్షించాలని సూచన న్యూఢిల్లీ: భారత్‌ ప్రతిపాదిత డేటా లోకలైజేషన్‌ నిబంధనలు, ఈ–కామర్స్‌ విధాన ముసాయిదాలోని ప్రతిపాదనలను అమెరికా ఆక్షేపించింది. ఇవి అత్యంత వివక్షాపూరితంగాను, వాణిజ్యాన్ని దెబ్బతీసేవిగాను ఉన్నాయని వ్యాఖ్యానించింది. 2019లో విదేశీ వాణిజ్యానికి ప్రతిబంధకాలు అంశంపై అమెరికా వాణిజ్య విభాగం (యూఎస్‌టీఆర్‌) రూపొందించిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. "భారత్‌ ఇటీవలే డేటాను స్థానికంగా భద్రపర్చాలని (లోకలైజేషన్‌)

ఐదు బేసిస్‌ పాయింట్ల రేటు తగ్గించిన ఎస్‌బీఐ

Wednesday 10th April 2019

ఐదు బేసిస్‌ పాయింట్ల రేటు తగ్గించిన ఎస్‌బీఐ - రూ.30 లక్షల వరకూ గృహ రుణంపై రేటు 0.10 శాతం తగ్గింపు ముంబై: అన్ని కాలపరిమితులకు సంబంధించి రుణ రేటును కేవలం ఐదు బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది. ఈ లెక్కన రేటు 0.05 శాతం తగ్గిందన్నమాట. ఏప్రిల్‌ 10 నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌

Most from this category