STOCKS

News


5జీ సేవల కోసం సాఫ్ట్‌బ్యాంక్‌తో బీఎస్‌ఎన్‌ఎల్ జట్టు

Monday 24th September 2018
news_main1537765096.png-20500

న్యూఢిల్లీ: దేశీయంగా  5జీ టెలికం సేవలు ప్రవేశపెట్టే దిశగా జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌, ఎన్‌టీటీ కమ్యూనికేషన్స్‌తో ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్ఎల్ చేతులు కలిపింది. ప్రధానంగా స్మార్ట్‌ సిటీలకు అవసరమయ్యే సొల్యూషన్స్‌ను రూపొందించే క్రమంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. పోటీ సంస్థలు 4జీ సర్వీసుల ద్వారా ఆదాయాలు ఆర్జించే పనిలో నిమగ్నమై ఉన్న నేపథ్యంలో 5జీ సేవలకు సంబంధించి దిగ్గజ సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మొగ్గు చూపుతున్నాయని ఆయన వివరించారు. టెలికం మంత్రి మనోజ్ సిన్హా చొరవతో ఈ ఒప్పందం కుదిరినట్లు శ్రీవాస్తవ చెప్పారు. సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన శాటిలైట్స్‌ను ఉపయోగించుకుని అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఈ ఒప్పందం తోడ్పడనుంది. త్వరలోనే 5జీ సర్వీసులను క్షేత్ర స్థాయిలో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 



You may be interested

ఎన్‌బీఎఫ్‌సీల్లో లిక్విడిటీపై ఆందోళనల్లేవు

Monday 24th September 2018

న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల(ఎన్‌బీఎఫ్‌సీ) లిక్విడిటీ విషయంలో ఆందోళనలేవీ లేవని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) చైర్మన్ రజనీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆ సంస్థలకు రుణపరమైన మద్దతు కొనసాగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. ఐఎఫ్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లో  రుణ సంక్షోభం నేపథ్యంలో రజనీష్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నెల ఆరంభంలో ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌... సిడ్బీకి చెల్లించాల్సిన రూ.1,000 కోట్ల స్పల్ప కాలిక రుణాల్లో డిఫాల్ట్‌

ఓఎన్‌జీసీ విదేశ్‌కు సర్వీస్‌ ట్యాక్స్‌ నోటీసులు

Monday 24th September 2018

న్యూఢిల్లీ: ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్(ఓఎన్‌జీసీ) విదేశీ అనుబంధ సంస్థ ఓఎన్‌జీసీ విదేశ్‌(ఓవీఎల్‌)కు పరోక్ష పన్నుల శాఖ నోటీసులు జారీచేసింది. గడిచిన దశాబ్ద కాలంలో చెల్లించాల్సిన పన్నులను ఎందుకు చెల్లించలేదని ప్రశ్నిస్తూ.. డిమాండ్‌, షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 2006 నుంచి 2017 మధ్యకాలంలో విదేశీ అనుబంధ సంస్థలు ఓవీఎల్‌కు సేవలు అందించినప్పటికీ, ఇందుకు సంబంధించిన సేవాపన్ను ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించింది. కంపెనీ తన ఆర్థిక నివేదికలలో ప్రకటించిన విదేశీ కరెన్సీ

Most from this category