STOCKS

News


ఆర్‌కామ్‌కు వ్యతిరేకంగా ఎన్‌సీఎల్‌టీకి బీఎస్‌ఎన్‌ఎల్‌

Monday 18th March 2019
news_main1552892904.png-24664

రూ.700 కోట్ల బకాయిల వసూలు కోసమే
న్యూఢిల్లీ: రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) నుంచి రూ.700 కోట్ల బకాయిలను రాబట్టుకునేందుకు ఈ వారంలోనే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)ను ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆశ్రయించనుంది. ఇప్పటికే ఎరిక్సన్‌ కేసులో ఈ నెల 19వ తేదీ నాటికి రూ.453 కోట్లను ఆర్‌కామ్‌ ప్రమోటర్‌ అనిల్‌ అంబానీ కట్టాల్సి ఉంది. లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. దీంతో బ్యాంకు ఖాతాలోని రూ.260 కోట్లను విడుదల చేసేలా ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని 37 రుణదాతలను ఆదేశించాలని ఎన్‌సీఎల్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ను ఆర్‌కామ్‌ ఆశ్రయించడం, ప్రజాధనాన్ని ప్రైవేటు పార్టీకి చెల్లించడాన్ని రుణదాతలు వ్యతిరేకించడం తెలిసిందే. ఆర్‌కామ్‌ ఇచ్చిన రూ.100 కోట్ల బ్యాంకు గ్యారంటీని విడిపించుకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటికే అనుమతి కోరడం జరిగింది. రూ.700 కోట్ల బకాయిల వసూలుకు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ అనుపమ్‌ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. వ్యాజ్యం దాఖలుకు సింగ్‌ అండ్‌ కోహ్లి న్యాయ సంస్థను ఎంచుకున్నట్టు చెప్పాయి.



You may be interested

పరిశ్రమ వర్గాలతో 26న ఆర్‌బీఐ గవర్నర్ భేటీ

Monday 18th March 2019

న్యూఢిల్లీ: వచ్చే నెల పరపతి విధాన సమీక్ష జరపనున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్‌ త్వరలో పరిశ్రమవర్గాలతో భేటీ కానున్నారు. ఈ నెల 26న వాణిజ్య సంఘాలు, రేటింగ్ ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారని, ఇందులో వడ్డీ రేట్లు, ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు తీసుకోతగిన చర్యలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆలిండియా బ్యాంక్ డిపాజిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులను కూడా దీనికి

సెన్సెక్స్‌ రికార్డుస్థాయికి చేరేముందు....

Monday 18th March 2019

ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను లిక్విడిటీ ముంచెత్తుతున్న నేపథ్యంలో భారత్‌కు సైతం హఠాత్తుగా విదేశీ నిధుల ప్రవాహం పెరిగింది. ఈ కారణంగా గతవారం పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ స్టాక్‌సూచీలు ఆల్‌టైమ్‌ రికార్డుస్థాయికి కేవలం 3 శాతం దూరంలో వున్నాయి. మరోవైపు అటు విదేశీ, ఇటు స్వదేశీ ఫండ్స్‌ ఫెవరేట్‌ రంగమైన బ్యాంకింగ్‌ సూచి గతేడాది నెలకొల్పిన రికార్డుస్థాయిని అవలీలగా అధిగమించేసి, ఈ రోజుకారోజు కొత్త రికార్డుల్ని నెలకొల్పుతోంది. అమెరికా కేంద్ర

Most from this category