News


వచ్చే క్వార్టర్‌కల్లా మెరుగుపడతాం

Saturday 18th May 2019
news_main1558152369.png-25809

  • బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆశాభావం

న్యూఢిల్లీ: నిధుల లభ్యతపరంగా ప్రస్తుతం తీవ్ర ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సెప్టెంబర్ త్రైమాసికానికల్లా పరిస్థితులు మెరుగుపడగలవని ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆశిస్తోంది. లిక్విడిటీ సమస్యల నుంచి బైటపడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్‌) ఎస్‌కే గుప్తా వెల్లడించారు. వివిధ సర్కిల్స్‌లో చీఫ్ జనరల్‌ మేనేజర్స్‌ (సీజీఎం)కు రాసిన లేఖలో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. టారిఫ్‌ల పరమైన పోరుతో టెలికం రంగంలో గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర పోటీ నెలకొందని గుప్తా చెప్పారు. "లిక్విడిటీ ఒత్తిళ్లను అధిగమించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ మేనేజ్‌మెంట్ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. సమీప భవిష్యత్‌లో కంపెనీ పరిస్థితి మెరుగుపడగలదని అంచనా వేస్తున్నాం" అని మే 16న రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. పోటీ సంస్థల కారణంగా ఆదాయానికి గండిపడుతున్నా.. కస్టమర్‌ బేస్‌ను కాపాడుకోగలుగుతున్నామని గుప్తా వివరించారు. టెలికం రంగంలో భారీగా పెట్టుబడులు అవసరమవుతాయని, వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఎప్పటికప్పుడు కొంగొత్త టెక్నాలజీలపై ఇన్వెస్ట్‌ చేస్తూనే ఉండాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిధుల కొరతకు ఇలాంటి అంశాలే కారణమన్నారు. 



You may be interested

డాక్టర్‌ రెడ్డీస్ లాభం 44 శాతం అప్‌

Saturday 18th May 2019

క్యూ4లో రూ.434 కోట్లు ఆదాయం 14 శాతం వృద్ధి రూ. 4,017 కోట్లు రూ.20 తుది డివిడెండు హైదరాబాద్‌, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్‌ఎల్‌) నికర లాభం 44 శాతం ఎగిసింది. రూ. 434.4 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ. 302.2 కోట్లు. మరోవైపు, తాజాగా నాలుగో త్రైమాసికంలో ఆదాయం 14 శాతం వృద్ధి

ఐఓసీ నికర లాభం రూ.6,099 కోట్లు

Saturday 18th May 2019

17 శాతం వృద్ధి తగ్గిన రిఫైనరీ మార్జిన్‌ ఆదుకున్న ఇన్వెంటరీ, కరెన్సీ మారకం లాభాలు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) గత ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.6,099 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం రూ.5,218 కోట్లతో పోలిస్తే 17 శాతం వృద్ధి సాధించామని ఐఓసీ తెలిపింది. షేర్‌ వారీ ఆర్జనను చూస్తే నికర

Most from this category