STOCKS

News


బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవా కేంద్రాల్లో ఆధార్ సర్వీసులు..

Friday 30th November 2018
news_main1543555448.png-22515

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌కి చెందిన 3,000 పైచిలుకు కస్టమర్ సర్వీస్ సెంటర్లలో త్వరలో ఆధార్ నమోదు, అప్‌డేషన్ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ చైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన పరికరాలు మొదలైన వాటికి దాదాపు రూ.90 కోట్లు వ్యయం కానుందని, దీనికి యూఐడీఏఐ తోడ్పాటు అందించనుందని ఆయన వివరించారు. ఈ వ్యవస్థ ఏర్పాటుకు మూడు నెలలు పట్టొచ్చని శ్రీవాస్తవ చెప్పారు. పరికరాల కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభిస్తామని, జనవరి 1 నాటికి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌, అప్‌డేషన్ సర్వీసులు అందించగలిగే తొలి సెంటర్‌ అందుబాటులోకి రాగలదని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆధార్‌ సర్వీసులు అందించే అధీకృత ఏజెన్సీల జాబితాలో బ్యాంకులు, పోస్టాఫీస్‌ల సరసన బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా చేరినట్లవుతుంది.



You may be interested

అమెజాన్‌పై జర్మనీ నియంత్రణ సంస్థ విచారణ

Friday 30th November 2018

బెర్లిన్‌: థర్డ్‌ పార్టీ విక్రేతల డేటాను తన లబ్ధికి ఉపయోగించుకుంటోందన్న ఆరోపణలపై యూరోపియన్ కమిషన్ విచారణ ఎదుర్కొంటున్న ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది. మార్కెట్లో ఆధిపత్యాన్ని అమెజాన్‌ దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై తాజాగా జర్మనీ నియంత్రణ సంస్థ ఫెడరల్ కార్టెల్ ఆఫీస్ దృష్టి సారించింది. పోటీ సంస్థలను తమ ప్లాట్‌ఫాంపై విక్రయించనివ్వకుండా అమెజాన్ అడ్డుకుంటోందన్న అంశంపై విచారణ ప్రారంభించింది. విక్రేతలకు సంబంధించి అమెజాన్ వ్యాపార నిబంధనలు, డేటా

పేటీఎమ్‌ నష్టాలు.. బుల్లెట్‌ ట్రైన్‌ బడ్జెట్‌ అంత !

Friday 30th November 2018

ముంబై: భారత్‌లో ఈ కామర్స్‌ సంస్థలకు భారీగా నష్టాలు వస్తున్నాయి. రానున్న సంవత్సరాల్లో ఈ నష్టాలు మరింతగా పెరగగలవని కోటక్‌ రీసెర్చ్‌ తాజా నివేదిక వెల్లడించింది. మొబైల్‌ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్‌ రెండేళ్ల క్రితం ఆరంభించిన పేటీఎమ్‌ మాల్‌కు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,806 కోట్ల మేర నష్టాలు వచ్చాయని ఈ నివేదిక పేర్కొంది. ఈ నష్టాలు.... ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ ట్రైయిన్‌ ప్రాజెక్ట్‌కు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఏడాది

Most from this category