STOCKS

News


బ్రూక్‌ఫీల్డ్‌ చేతికి లీలా హోటల్స్‌ !

Tuesday 18th December 2018
news_main1545109782.png-23029

కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ భారత ఆతిథ్య రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ సంస్థ హోటల్‌ లీలా వెంచర్‌ను చెందిన హోటళ్లను, బ్రాండ్‌ను రూ.4,500 కోట్లకు కొనుగోలు చేయనున్నదని సమాచారం. భారీ రుణభారంతో కుదేలైన హోటల్‌ లీలా వెంచర్‌కు ఈ డీల్‌ ఊరట నిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హోటల్‌ లీలా వెంచర్‌కు రూ.3,799 కోట్ల మేర రుణభారం ఉంది. 
తుది దశలో డీల్‌...! 
ఈ డీల్‌లో భాగంగా హోటల్‌ లీలా వెంచర్‌కు సంబంధించిన మొత్తం ఐదు లగ్జరీ హోటళ్లలో కనీసం నాలుగింటిని బ్రూక్‌ఫీల్డ్‌ కొనుగోలు చేయనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్‌లో భాగంగా ఈ హోటల్‌కే చెందిన ఆగ్రాలోని ఒక భారీ నివాస స్థలాన్ని కూడా  బ్రూక్‌ఫీల్డ్‌ కొనుగోలు చేయనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్‌ బహుశా... వచ్చే ఏడాది ఆరంభంలోనే పూర్తికావచ్చని అంచనా. డీల్‌ దాదాపు తుది దశలో ఉందని, డీల్‌ సంబంధ వివరాలు నెల రోజుల్లోపలే వెల్లడవుతాయని, లీలా బ్రాండ్‌ను కూడా బ్రూక్‌ఫీల్డ్‌ కొనుగోలు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. 
4- 5 ఏళ్ల నుంచి ప్రయత్నాలు 
1986లో సి.పి.కృష్ణన్‌​నాయర్‌ ప్రారంభించిన హోటల్‌ లీలా వెంచర్స్‌... ఒకప్పుడు ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ, తాజ్‌ హోటల్స్‌, ఈఐహెచ్‌లకు గట్టి పోటీనిచ్చింది. ప్రస్తుతం హోటల్‌ లీలా వెంచర్‌ ఐదు లగ్జరీ హోటళ్లను నిర్వహిస్తోంది. న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, ఉదయ్‌పూర్‌లో ఉన్న ఈ లగ్జరీ హోటళ్లలో మొత్తం గదుల సంఖ్య 1,400గా ఉంది. రుణ భారం తగ్గించుకోవడానికి 2014లో వాణిజ్య రుణ పునర్వ్యస్థీకరణ కోసం హోటల్‌ లీలా వెంచర్‌ ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో తన రుణాలను ఆసెట్‌ రీస్ట్రక్చరింగ్‌ సంస్థ, జేఎమ్‌ ఫైనాన్షియల్‌ ఏఆర్‌సీకి బదిలీ చేసింది. 2017 సెప్టెంబర్‌లో జేఎమ్‌ ఏఆర్‌సీకి రూ.275 కోట్ల విలువైన 16 లక్షల షేర్లను కేటాయించడం ద్వారా రుణాన్ని ఈక్విటీగా మార్చింది. హోటల్‌ లీలా వెంచర్‌లో జేఎమ్‌ ఏఆర్‌సీకి 26 శాతం వాటా ఉంది. భారీగా పేరుకుపోయిన రుణ భారాన్ని తగ్గించుకోవడానికి  హోటళ్లను, ఖాళీ స్థలాన్ని విక్రయించాలని హోటల్‌ లీలావెంచర్‌ గత నాలుగు-ఐదేళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది.
బ్రూక్‌ఫీల్డ్‌... భారీ కొనుగోళ్లు.....
ఇక ​‍బ్రూక్‌ఫీల్డ్‌ కంపెనీ ఇప్పటికే భారత్‌లో కమర్షియల్‌ ఆఫీస్‌, రెసిడెన్షియల్ అసెట్స్‌, ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసింది. 2013లో యూనిటెక్‌ కార్పొరేట్‌ పార్క్స్‌ను కొనుగోలు  చేసింది.ఆ తర్వాత హీరా నందాని గ్రూప్‌ కమర్షియల్‌ ఆఫీస్‌ వెంచర్‌ను రూ.6,700 కోట్లకు, ఎస్సార్‌ గ్రూప్‌ ఈక్వినాక్స్ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ను రూ.2,400 కోట్లకు చేజిక్కించుకుంది. కాగా హోటల్‌ లీలా వెంచర్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన మైనర్‌ ఇంటర్‌నేషనల్‌ అండ్‌ ట్రినిటీ వైట్‌ సిటీ వెంచర్స్‌ సంస్థ రూ.2,500 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నదన్న వార్తల కారణంగా గత నెలలో ఈ షేర్‌ బాగా పెరిగింది. సోమవారం ఈ షేర్‌ 4.7 శాతం లాబంతో రూ.15.55 వద్ద ముగిసింది. You may be interested

ఏప్రిల్‌ నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ చార్జీలకు కత్తెర

Tuesday 18th December 2018

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫం‍డ్స్‌ పథకాల్లో ఇన్వెస్టర్ల నుంచి ఏఎంసీలు వసూలు చేసే చార్జీలకు కోత విధిస్తూ సెబీ నూతన నిబంధనలను విడుదల చేసింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువపై నిర్ణీత శాతం మేర టోటల్‌ ఎక్స్‌పెన్స్‌రేషియో (టీఈఆర్‌) పేరుతో ఏఎంసీలు వసూలు చేస్తుంటాయి. ఈ టీఈఆర్‌ చార్జీలపై పరిమితి విధించాలన్న ప్రతిపాదనకు సెబీ బోర్డు ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఆమోదం తెలియజేయగా, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల

హిటాచీ చేతికి ఏబీబీ పవర్ వ్యాపారం

Tuesday 18th December 2018

న్యూఢిల్లీ: స్విస్ ఇంజినీరింగ్ దిగ్గజం ఏబీబీకి చెందిన పవర్ గ్రిడ్స్ వ్యాపార విభాగాన్ని జపాన్‌ సంస్థ హిటాచీ కొనుగోలు చేయనుంది. ఈ విభాగంలో 80.1 శాతం వాటాలను హిటాచీ కొనుగోలు చేస్తున్నట్లు ఏబీబీ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం పవర్ గ్రిడ్స్‌ వ్యాపార పరిమాణాన్ని 11 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.79,200 కోట్లు) లెక్క కట్టినట్లు, డీల్ విలువ సుమారు 6.4 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 46,080 కోట్లు)

Most from this category