ఆర్‌ఐఎల్‌పై బ్రోకరేజ్‌లు పాజిటివ్
By D Sayee Pramodh

క్యు3 ఫలితాలు అదరగొట్టిన ఆర్‌ఐఎల్‌పై బ్రోకరేజ్‌లు పాజిటివ్‌గా ఉన్నాయి.
1. సీఎల్ఎస్ఏ: కొనొచ్చు రేటింగ్. టార్గెట్ రూ. 1500. అన్ని విభాగాల్లో అదరగొట్టే ప్రదర్శన చూపింది. పెట్రోకెమికల్ విభాగంలో మాత్రం కొంత వెనుకంజ కనిపించింది. రిటైల్ విభాగపు ప్రదర్శన చాలా బాగుంది. పెట్రోకెమికల్ విభాగపు పేలవ ప్రదర్శనను ఇతర విభాగాలు భర్తీ చేశాయి. టవర్ వ్యాపారానికి సంబంధించిన డీల్‌ను జియో ఈ ఏడాది ప్రథమార్ధంలో పూర్తి చేయవచ్చని అంచనా. రిటైల్ ఎర్నింగ్స్ గతేడాదితో పోలిస్తే దాదాపు మూడు రెట్లు పెరగడం పాజిటివ్ అంశం.
2. మాక్క్వైరీ: అవుట్‌పెర్ఫామ్ రేటింగ్. టార్గెట్. రూ. 1315. అనుకున్నదానికన్నా పెట్రోకెమ్ వ్యాపారం మంచి ప్రదర్శనే చూపింది. జియో, రిటైల్ విభాగాలు అంచనాలను అందుకున్నాయి. రాబోయే సంవత్సరాల్లో రిఫైనింగ్ మార్జిన్లు 15-20 డాలర్ల మేర బలపడవచ్చు. ఈపీఎస్ బలంగా ఉంది.
3. మోర్గాన్‌స్టాన్లీ: జియో ఎప్పటిలాగానే బలమైన కస్టమర్ బేస్‌తో దూసుకుపోతోంది. ఏఆర్పీయూ అవుట్‌లుక్ బాగుంది. టారిఫ్‌లు యథాతధంగా కొనసాగిస్తామని కంపెనీ చెబుతోంది. దీంతో రాబోయే రోజుల్లో ప్రాఫిటబిలిటీ మరింత పెరగవచ్చు.
You may be interested
ఫ్లిప్‌కార్ట్ ఇండియాలోకి రూ.1,431 కోట్లు
Friday 18th January 2019న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇండియా తాజాగా రూ. 1,431 కోట్లు సమీకరించింది. సింగపూర్‌కి చెందిన మాతృ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ నిధులు సమీకరించినట్లు సంస్థ తెలియజేసింది. ఈ నిధులకు ప్రతిగా మాతృ సంస్థకు 4.86 లక్షల షేర్లు కేటాయించామని, ఒక్కో షేరు ధరను రూ. 29,400గా నిర్ణయించామని కంపెనీ వెల్లడించింది. గతేడాది డిసెంబర్లో కూడా ఫ్లిప్‌కార్ట్ ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ రూ.2,190 కోట్లు పెట్టుబడి పెట్టింది. విదేశీ పెట్టుబడులున్న
బీహెచ్ఈఎల్ ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు
Friday 18th January 2019ఢిల్లీ-చండీగఢ్ హైవేపై ఏర్పాటు న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఢిల్లీ- చండీగఢ్ జాతీయ రహదారిపై సోలార్ ఆధారిత చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ రంగంలోని బీహెచ్ఈఎల్ ప్రకటించింది. ‘‘250 కిలోమీటర్ల పరిధిలో మధ్య మధ్యలో ఈ ఎలక్ట్రిక్ చార్జర్లను ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల మధ్యలో చార్జింగ్ అయిపోతుందేమో!! ప్రయాణించటం కష్టమేమో!! అనే భయాలు ఎలక్ట్రిక్ వాహనాదారుల్లో తొలగుతాయి. ఎలక్ట్రిక్ వాహన ప్రయాణాలపై విశ్వాసం పెరుగుతుంది’’ అని భెల్ వివరించింది.