STOCKS

News


బ్రిటానియా లాభం రూ.303 కోట్లు

Tuesday 13th November 2018
news_main1542085083.png-21926

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో 16 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.261 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.303 కోట్లకు పెరిగిందని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,596 కోట్ల నుంచి 12 శాతం పెరిగి రూ.2,914 కోట్లకు ఎగసిందని కంపెనీ ఎమ్‌డీ వరుణ్‌ బెర్రి చెప్పారు. ఎబిటా రూ.378 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.454 కోట్లకు ఎగసిందని పేర్కొన్నారు. ఇక నిర్వహణ మార్జిన్‌ 14.8 శాతం నుంచి 1 శాతం పెరిగి 15.8 శాతానికి చేరిందని వివరించారు. 
అమ్మకాలు రెండంకెల వృద్ధి సాధించడం ఇది వరుసగా నాలుగో త్రైమాసికమని బెర్రి పేర్కొన్నారు. బ్రాండ్లపై పెట్టుబడులు పెట్టడం, నెట్‌వర్క్‌ను విస్తరించడం, గ్రామీణ మార్కెట్లు, బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఈ ఘనత సాధించామని వివరించారు. మొత్తం వ్యయాలు రూ.2,203 కోట్ల నుంచి రూ.2,455 కోట్లకు పెరిగాయి. రెండు కొత్త కేటగిరీల ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చామని, క్రీమ్‌ వేఫర్స్‌, ఫ్లేవర్డ్‌ మిల్క్‌ షేక్స్‌లను టెట్రా ప్యాక్‌లలో అందుబాటులోకి తెచ్చామని వివరించారు. నేపాల్‌లో ప్లాంట్‌ ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌ నుంచి అందుబాటులోకి రానున్నదని పేర్కొన్నారు. ముడి పదార్ధాల ధరలు పెరిగినప్పటికీ, కఠినమైన వ్యయ నియంత్రణ పద్దతులు పాటించడం వల్ల లాభదాయకత మెరుగుపడిందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఈ షేర్‌ ఫ్లాట్‌గా, రూ.5,754 వద్ద ముగిసింది.
 



You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 13th November 2018

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- తన కంపెనీ నెట్‌వర్క్‌ని మరింత వేగవంతం చేసుకోవడకానికి నెట్‌బ్రెయిన్‌ కంపెనీతో జట్టు కట్టింది. ఎన్‌బీసీసీ:- ఆయుష్‌ మంత్రిత్వశాఖ నుంచి రూ.260 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది. లుపిన్‌:- అటోవాక్వోన్ ఓరల్ సస్పెన్షన్ యుఎస్‌పీ ఔషధాలకు అమెరికా మార్కెట్లో విడుదల చేసింది. అరబిందో ఫార్మా:- తన అనుబంధ సంస్థ ఆస్ట్రేలియాకు చెందిన అడ్వెంట్ ఫార్మాస్యూటికల్స్ పీటీవై కంపెనీ ఆస్తులను సొంతం చేసుకుంది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నష్టాలు రూ.1,156 కోట్లు

Tuesday 13th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో భారీ నష్టాలను చవిచూసింది. మొండి బకాయిలకు కేటాయింపులు పెరగడంతో ఈ క్యూ2లో రూ.1,156 కోట్ల నికర నష్టాలు వచ్చాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.179 కోట్లు, ఈ క్యూ1లో రూ.95 కోట్లు చొప్పున నికర లాభాలు వచ్చాయని పేర్కొంది. గత క్యూ2లో రూ.11,600 కోట్లుగా ఉన్న మొత్తం

Most from this category